దర్శకేంద్రుడిపై కేసు వేసిన బాలకృష్ణ
సినీ రంగానికి ఉపయోగపడే స్టూడియో లాంటివిని నిర్మిస్తానని చెప్పి రాఘవేంద్రరావు 300 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా రూ. 80 వేలకు ఎకరం చొప్పున చెల్లించి దక్కించుకున్నాడు. అయితే ఆయన ఆ స్థలంలో ఎలాంటి సినీ స్టూడియో, రికార్డింగ్, డబ్బింగ్ లాంటి వాటికి ఉపయోగపడే స్టూడియోలను నిర్మించకుండా సినిమాక్స్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారం చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్దం అంటున్నారు పిటీషనర్. మరి కోర్టు ఈ పిటీషన్‍పై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
ప్రస్తుతం రాఘవేంద్రరావు నాగార్జున హీరోగా 'షిరిడి సాయి' చిత్రం రూపొందిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది. జూలై 30వ తేదీన ఈచిత్రం ఆడియో హైదరాబాద్‌లో రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 6న సినిమా థియేటర్లలోకి రానుంది. గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications












