టిక్కెట్ రేట్ పెంచటంపై కేస్
బాల్కనీ శ్రేణి సినిమా టికెట్ల ధరను పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన 369 జీవోను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిని హైదరాబాద్‌లోని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు దాఖలు చేశారు. జీవో 175 ప్రకారం ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎన్నో రాయితీలు కల్పించిందని, పన్నులు బాగా తగ్గించిందని, దాని ద్వారా ప్రయోజనం పొందుతున్న పరిశ్రమ 30 శాతం ధరలు తగ్గించాల్సింది పోయి పెంచడమేమిటని రిట్‌లో ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











