దాడి కేసు: పరారీలో రామానాయుడు మనవడు
ఈ సంఘటనపై ఆరా తీయగా..... రవితేజ అనే ఇంజనీర్‌కు, అభిరాంకు మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అభిరాం అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో అభిరాం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
అభిరాం దాడి చేయడంతో ఇంజనీర్ రవితేజ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు రామానాయుడు కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
అభిరాంను త్వరలో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అభిరాంపై దాడి కేసు నమోదవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం అభిరాం నటనతో పాటు సినీమాకు సంబంధించిన ఇతర రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications












