ఫ్రీగానే శ్రీజ-శిరీష్ కేసు:పింకీ ఆనంద్
ఎనిమిదవ తరగతి చదవుతున్న కూతురుకు తల్లిగాఉన్న ప్రముఖ ఢిల్లీ న్యాయవాది పింకీ ఆనంద్ శ్రీజ-శిరీష్ భరద్వాజ్ లకు ఫుల్ సపోర్ట్ గా కోర్టులోపల వెలుపల మాట్లాడుతోంది. వారిద్దరి గురించి ఇంతకు ముందే అన్నీ తెలిసినట్టుగా చెబుతోంది. తన కూతురు కూడా శ్రీజలా చేసినా ఏం చేయగలం అంటోంది పింకీ ఆనంద్. చిరంజీవి కూతురు శ్రీజ కేసును చేపట్టి మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కిన పింకీ ఆనంద్ తను శ్రీజ-శిరీష్ ల వద్ద ఫీజుగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారామె. శ్రీజ-శిరీష్ లు ఒకే కారులో వయా గోవా టు ఢిల్లీకి వచ్చారట. వారిద్దరి వివాహం వెనుక రాజకీయ ప్రమేయం ఏమీ లేదని చెబుతోంది మాజీ ఎబివిపి విద్యార్థి నాయకురాలైన పింకీ. చిరంజీవి ఎందుకు మౌనంగా ఉంటున్నాడో అంటూ శ్రీజ-శిరీష్ ను ఎందుకు ఆహ్వనించడంలేదో అర్థం కావడంలేదని అంటోంది. ఈ కేసు వాదించమని ఎవరూ చెప్పలేదని వారే తనవద్దకు నేరుగా వచ్చారని చెబుతోంది. శ్రీజ ఇష్టాఇష్టాలను చిరంజీవి గౌరవించాలని, శిరీష్ తో మాట్లాడుతుంటే మంచివాడే అనిపిస్తోందని చెబుతోంది. శిరీష్ కు రెండు పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయట కదా అంది. ఇన్ని చెప్పిన పింకీ ఆనంద్ చిరంజీవి తరఫున ఎవరైనా మట్లాడారా అంటే నో కామెంట్స్ అంటోంది.


Click it and Unblock the Notifications











