»   » నాగార్జున పబ్‌పై పోలీసుల దాడులు!

నాగార్జున పబ్‌పై పోలీసుల దాడులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటుడు నాగార్జున యజమానిగా ఉన్న 'ఎన్ గ్రిల్' పబ్‌పై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు ఆదివారం రైడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.36లో ఉన్న ఈ పబ్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతుండటం, సమయం మించిన తర్వాత కూడా పబ్ ఓపెన్ చేసి ఉండటంతో మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అదే ప్రాంతంలోని మరో రెండు పబ్ లపై కూడా పోలీసులు దాడులు జరిపినట్లు తెలుస్తోంది. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ వద్దగల మోవిడా పబ్‌తో పాటు దస్పల్లా హోటల్ వద్ద గల ఓవర్ ది మూన్ పబ్ పై కూడా పోలీసులు దాడులు నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి.

నాగార్జునకు చెందిన పబ్ గతంలోనూ పలు పర్యాయాలు కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంది. అయితే ఇన్నిసార్లు అలా జరిగినా నిబంధనల ప్రకారం పబ్ నిర్వహించడంలో యాజమాన్యం విఫలం అవడం గమనార్హం. ఇలాంటి పరిణామాలు నాగార్జునకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన నటించిన 'భాయ్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలతో 'మనం' చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలను నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు.

English summary
Cases have been booked against Nagarjuna's 'M Grill' pub manager for serving alcohol beyond the permitted time and allowing the customers to stay in the pub post 11 pm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu