»   » ఓటుకు నోటు : టాలీవుడ్ స్టార్స్-పొలిటికల్ స్టాండ్స్

ఓటుకు నోటు : టాలీవుడ్ స్టార్స్-పొలిటికల్ స్టాండ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజకీయ రంగం..సినిమా రంగాల మధ్య ఇండియాలో చాలా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇరు వర్గాలు చేతిలో చేయ్యేసుకుని తిరిగే దృశ్యాలు మనం చూసాం. ఎన్నికల సమయంలో సినీ స్టార్లు పలువురు రాజకీయ నాయకులకు మద్దతుగా నిలిచిన సందర్భాలు అనేకం.

ప్రముఖ తెలుగు నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన ‘తెలుగు దేశం' పార్టీ తెలుగునాట అప్పట్లో ఓ సంచలనం. అయితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

రేవంత్ రెడ్డి రెడ్ హాండెడ్ గా దొరకడం, వీడియో ఫ్రూప్ కూడా ఉండటం హాట్ టాపిక్ అయింది. ఏపీ చంద్రబాబు నాయుడుకు కూడా ఈ కేసు మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ఓటుకు నోటు వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్.

ఈ వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పొలిటికల్ డ్రామా ఉత్కంఠభరితంగా మారింది. ఈ విషయానికి సంబంధించిన గతంలో వివిధ పార్టీల తరుపున ఉన్న మన టాలీవుడ్ స్టార్లు ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం కూడా ఆసక్తి‌కరమే. గత ఎన్నికల్లో మన స్టార్ల పొలిటికల్ స్టాండ్ ఎటు వైపు ఉందో చూస్తే.... వారి మనసులో ఏ ముందు ఊహించడానికి అవకాశం ఉంటుంది. 

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీ‌కి మద్దతుగా నిలిచారు. ప్రచారం కూడా చేసారు. ప్రస్తుత ఓటుకు నోటు రాజకీయంపై పవన్ కళ్యాణ్ ఏమి ఆలోచిస్తున్నారో?

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసిన తన బావ గల్లా జయదేవ్‌కు మద్దతు ఇచ్చారు. మరి మహేష్ బాబు ఈ వ్యవహారంపై ఏం ఆలోచిస్తున్నారో?

నాగార్జున

నాగార్జున

నాగార్జున అన్ని పార్టీలతో మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. మరి ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన మనసులో ఏముందో?

చిరంజీవి

చిరంజీవి

కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

తండ్రి చిరంజీవి ఎటు వైపు ఉంటే రామ్ చరణ్ కూడా అటు వైపే....

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

తన తాతయ్య స్థాపించిన తెలుగు దేశం పార్టీకే తన మద్దతు అని ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన ఏం ఆలోచిస్తున్నారో?

బాలకృష్ణ

బాలకృష్ణ

తన తండ్రి స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ.... స్టాండ్ ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

English summary
Politics and Cinema are somehow closely knitted in India. Especially in our Telugu states, they go hand in hand. Many of our stars forayed in to politics and made it much closer to cinema industry.
Please Wait while comments are loading...