»   » మహేష్ కొత్త సినిమాలో నటించాలని ఉందా,అయితే ఇది మీకోసమే

మహేష్ కొత్త సినిమాలో నటించాలని ఉందా,అయితే ఇది మీకోసమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే మహేష్, మురగదాస్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ సెట్ అయిన దగ్గరనుంచి రోజుకో వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్టుని సెట్ చేసారు. మహేష్ బాబుకు నిర్మాత ఎన్.వి ప్రసాద్ తో చిత్రం కమిట్ మెంట్ ఉంది. అలాగే మురుగదాస్ కు ఠాగూర్ మధు తో సినిమా చెయ్యాలని ఎగ్రిమెంట్ ఉంది. ఈ రెండూ కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.

త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతోంది. ఈ మేరకు సంస్ద వారు కాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు ఎన్ వి ఆర్ సినిమా ఆఫీస్ , ఫిల్మ్ నగర్ కు వెళ్లాలి.

ఈ సినిమా కోసం..15-18 సంవత్సరాల లోపు యువతలు, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లు , 30-45 సంవత్సరాల వయస్సులో ఉన్న మేల్ ఆర్టిస్ట్ లు, 25-40 మధ్య ఉన్న ఫిమేల్ ఆర్టిస్ట్ లు అవసరం. అలాగే పిల్లలు ఏడు నుంచి 9 సంవత్సరాలు లోపు ఉండాలి. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు 19-22 వయస్సులో వారు, హీరోయిన్ సోదరి పాత్రలకు 17-20 మధ్య వయస్సు ఉన్న వారు అవసరమని చెప్తున్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.

త్వరలో ప్రారంభం కానున్న మహేష్, మురుగదాస్ కాంబినేషన్ చిత్రానికి ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతోంది. ఈ మేరకు సంస్ద వారు కాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చారు. ఈ సినిమా కోసం..15-18 సంవత్సరాల లోపు యువతలు, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లు , 30-45 సంవత్సరాల వయస్సులో ఉన్న మేల్ ఆర్టిస్ట్ లు, 25-40 మధ్య ఉన్న ఫిమేల్ ఆర్టిస్ట్ లు అవసరం. అలాగే పిల్లలు ఏడు నుంచి 9 సంవత్సరాలు లోపు ఉండాలి. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు 19-22 వయస్సులో వారు, హీరోయిన్ సోదరి పాత్రలకు 17-20 మధ్య వయస్సు ఉన్న వారు అవసరమని చెప్తున్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.

English summary
Wonderful opportunity to be a part of the prestigious film of Tollywood being directed by AR Muragadoss. Super Star Mahesh Babu is going to play the lead role in the film. The casting call has been announced and the following are the details about the requirements.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu