twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించాలని ఉందా? సువర్ణ అవకాశం మీకోసం.. బాలయ్య పిలుపు!

    By Rajababu
    |

    తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దిగ్గజ నటుడు, సంచలన రాజకీయ వేత్త స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటించాలనుకొనే ఔత్సాహికుల కోసం చిత్ర యూనిట్ ఓ ప్రకటన జారీ చేసింది.

    నటిస్తూ, తెర మీద కనిపిస్తూ జీవించాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ మంచి అవకాశాలు రానివాళ్లు కొందరు.. ఏది మంచి అవకాశమో అర్థం కాని వాళ్లు కొందరు..అలాంటి వాళ్లందరికీ ఒక అవకాశం ఇవ్వాలనుకొంటున్నాము అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

    Casting call for NTR Biopic

    ఎన్‌బీకే ఫిల్మ్స్ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నాం.. ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు రెండు ఫొటోలు, సెల్‌ఫోన్‌తో మీ పెర్ఫార్మెన్స్‌ను షూట్ చేసిన 30 సెకన్ల నిడివితో ఉన్న రెండు వీడియోలను మాకు ఈ మెయిల్ చేయండి అని ప్రకటనలో తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్‌కు రావొద్దు.. ఎంపిక చేసిన వారిని ఆడిషన్ష్‌కు ఆహ్వానిస్తాం అని వెల్లడించారు.

    ఈ మెయిల్ అడ్రస్: [email protected]

    English summary
    The highly anticipated NTR biopic, which will star Nandamuri Balakrishna in the role of legendary NT Rama Rao, will hit the screens during the Sankranti festival next year. To be directed by Teja initially, it was confirmed on Monday that Krish Jagarlamudi will direct it. Nandamuri Balakrishna starrer NTR biopic was initially to be directed by Teja. However, it was confirmed on Monday that Gauthamiputra Satakarni director Krish Jagarlamudi would take over the reins. For this movie, film unit given casting call for all categories.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X