Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘అన్నీ కోతి మొహాలే, రామానాయుడు ఆస్తులు అమ్ముకున్నాడు, కానీ వీరు.....’
Recommended Video
'సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్' అంశంపై హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శృతి సంచలన కామెంట్స్ చేశారు. శివాజీ రాజా మీద, పవన్ కళ్యాణ్, ఇతర హీరోల మీద ఆమె ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఏమిటీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంతకాలం ముసుగులో గుద్దులాటలాగా ఉండేది. ఇపుడు మేమంతా చెబుతుంటే జనాలకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందని తెలిపారు.
అందుకే మాకు అవకాశాలు లేవు
సినిమా వాళ్లు అనగానే బయట అందరికీ ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఇపుడెందుకు మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు పడుకుని క్యారెక్టర్లు తెచ్చుకున్నారు కదా అని కొందరు అంటున్నారు. మేము అలా పడుకుని చేసుకుని ఉంటే ఇలా బయటకు వచ్చేవారం కాదు. ఎవరైతే ఇపుడు బయటకు రాకుండా ఉన్నారో వాళ్లలో మేము ఒకరిలా ఉండేవారం. కరాటే కళ్యాణి, సత్యా చౌదరి ఎవరొచ్చినా మేము మాట్లాడటానికి సిద్ధమే అని..... నటి శృతి అన్నారు.
శివాజీ రాజా ఎందుకు రావడం లేదు
డైరెక్షన్ డిపార్టుమెంటు వారు, ప్రొడ్యూసర్లు ఎవరూ కూడా బయటకు మాట్లాడటం లేదు. నేను టీవీ ఛానల్స్ లైవ్లో కూడా చెప్పాను... శివాజీ రాజా అలాంటోడే, అమ్మాయిలను ఇలా చేస్తాడు అని డైరెక్టుగానే చెప్పాను. ఈ రోజు ఆయన ఎందుకు స్పందించడం లేదు. కత్తి మహేష్ మీద ఓ అమ్మాయి ఆరోపణలు చేస్తే నేను అలా చేయలేదు అంటూ బయటకు వచ్చి నీ మీద కేసు వేస్తానని ప్రకటన చేశాడు. మరి శివాజీ రాజా ఎందుకు బయటకు రావడం లేదు...అని శృతి ప్రశ్నించారు.
కొంత మంది మంచి వారు ఎంకరేజ్ చేస్తున్నారు
ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ పెద్ద పెద్దోళ్లే ఉన్నారు. కానీ వారు ఎందుకు రావడం లేదు? ఇపుడొచ్చి మా అందరికీ హెల్ప్ చేయమనండి. మాకు యాక్టింగ్ రాదా? పడుకుంటేనే వేషాలు ఇస్తారా? వేరే అమ్మాయిలను పడుకోబెడితేనే అవకాశాలిస్తారా?...... పడుకోవట్లేదని మాకు సినిమాల్లో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. సీరియల్స్ లో కొంత మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి మంచి వారి వల్లే మేము ఈ మాత్రం అయినా ఉన్నాం. మిగతా చెడ్డ వారి వల్ల పైకి ఎదగలేక పోతున్నాం. ఇది మీరందరూ గమనించాలి.... అని శృతి అన్నారు.
రామానాయుడు ఆస్తులు అమ్ముకుని తీశాడు, కానీ వీరు
అప్పట్లో రామానాయుడు గారు సినిమాలు తీశారు... సినిమా అంటే ఆయనకు పిచ్చి, పాషన్, అందుకే ఆస్తులు అమ్మి తీశాడు. ఇపుడు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇలా నలుగురు పెద్దలు ఉన్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా మరో 10 తరతరాలు కూర్చుని తినేలా సంపాదిస్తున్నారు.... అని శృతి ఫైర్ అయ్యారు.
అన్నీ కోతి మొహాలే
అన్నీ సినిమాల్లో వాళ్ల హీరోలే... వాళ్ల మనవళ్లే... ఒక్క మొహమైనా బావుంటుందా? అన్నీ కోతి మొహాలే... 30 సర్జరీలు చేస్తేగానీ వారికి షేపులు రావు. ఒక్క హీరో అయినా హైట్ ఉంటాడా? ఎవరో కొంత మంది తప్ప మిగతా వారు హీరోలుగా పనికొస్తారా? ఈ విషయం జనాలకు కూడా తెలుసు?... అంటూ శృతి మండి పడ్డారు.
పవన్ కళ్యాణ్ బాగా సంపాదించుకుంటున్నాడు
పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు.... ఆయన ఏం చేస్తున్నాడు? ఫ్యాన్స్ అందరినీ అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ లోకి వచ్చి ఇంకా సంపాదించుకుంటున్నాడు. అమరావతిలో ఇల్లు కొన్నాడు. కేవలం సినిమాలు చేసే పవన్ కళ్యాణ్ ఇదంతా సంపాదించాడా? ఈ విషయం అందరూ గమనించాలి అంటూ శృతి ఆరోపించారు.