»   » కామాంధుడు, రవితేజ సినిమాలో ఛాన్స్ అని చెప్పి టివి నటి ముఖం, వీపుపై దారుణంగా!

కామాంధుడు, రవితేజ సినిమాలో ఛాన్స్ అని చెప్పి టివి నటి ముఖం, వీపుపై దారుణంగా!

Subscribe to Filmibeat Telugu
రవితేజ సినిమాలో ఛాన్స్ ... ముఖం మరియు వీపుపై దారుణంగా బెల్టుతో దాడి

సినిమా అవకాశాల పేరుతో వర్ధమాన నటుల్ని, సినిమా అవకాశాల కోసం ఎదురుచొస్తున నటుల్నిలైంగికంగా వేధించడం ఎక్కువవుతోంది. కాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటులు, హీరోయిన్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. రవితేజ సినిమాలో అవకాశం అంటూ ఓ టివి నటికి నమ్మ బలికిన ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.

 కాస్టింగ్ కౌచ్

కాస్టింగ్ కౌచ్

సినీ అవకాశాల పేరుతో వక్ర బుద్ది కలిగిన కొందరు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆగడం లేదు. అమ్మాయిలని సినీ అవకాశాల పేరుతో లోబరుచుకోవడనికి జరుగుతున్న అనేక ఘటనకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

 గళం విప్పుతున్న ప్రముఖులు

గళం విప్పుతున్న ప్రముఖులు

ఇలాంటి ఘటనలపై ప్రముఖులంతా గళం విపుతున్నారు. చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన అనుభవాలని మీ టూ హ్యాష్ టాగ్ ద్వారా పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

 అలాంటి అమ్మాయిలే టార్గెట్

అలాంటి అమ్మాయిలే టార్గెట్

హీరోయిన్ కావాలని కలలుకనే అమ్మయిలు, సినీ ఇండస్ట్రీలో నటిగా రాణించాలని ఆశపడే మహిళలే కామాంధులకు టార్గెట్ గామారుతున్నారు. సినీ అవకాశాల పేరుతో వారిని మోసం చేసి లైంగికంగా వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 తాజగా మరో ఘటన

తాజగా మరో ఘటన

ఇలాంటి ఘటనే తాజగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టివి నటిపై ఓ వ్యక్తి లైంగికంగా దాడికి తెగబడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

పేస్ బుక్ ద్వారా

పేస్ బుక్ ద్వారా

బంజారా హిల్స్ పోలీస్ ల వివరాల ప్రకారం ఓ టివి నటిపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. టివి నటికి పేస్ బుక్ ద్వారా జగదీశ్ అనే వ్యక్తితో పరిచయం అయినట్లు తెలుస్తోంది.

 రవితేజ సినిమాలో ఛాన్స్

రవితేజ సినిమాలో ఛాన్స్

రవితేజ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇప్పిస్తానని నమ్మ బలికిన అతడు ఆ నటిని తన ఫ్లాట్ కు రప్పించుకున్నాడు. ఫ్లాట్ లో యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించింది.

 దారుణంగా దాడి

దారుణంగా దాడి

దీనితో ఆ కామాందుడు యువతి ముఖం మరియు వీపుపై దారుణంగా బెల్టుతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆ బాధితురాలు బంజారా హిల్స్ పోలీస్ లని ఆశ్రయించింది.

English summary
Casting couch incident in Hyderabad. Man harassed TV actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu