సినిమా అవకాశాల పేరుతో అసభ్యంగా ఫోటోలు.. తిరుపతిలో చీటింగ్!
టాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ గురించి ఇటీవల హాట్ హాట్ చర్చ జరిగింది. సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలని చీటింగ్ చేస్తున్న ఉదంతాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటన ఒకటి తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. సినిమా అవకాశలు ఇప్పిస్తానంటూ కొందరు యువతుల్ని సురేష్ అనే వ్యక్తి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తిరుపతిలో స్థానికంగా నివాసం ఉంటున్న సురేష్ అనే వ్యక్తి కొందరు అమ్మాయిలని ఆడిషన్స్ పేరుతో హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు తీసుకుని వెళ్లడం ఫొటో షూట్స్ చేయడం గత ఆరునెలలుగా చేస్తున్నాడు. ఆ ఫోటోలని అసభ్యంగా చిత్రీకరించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు లైంగికంగా సహకరించాలని వేధించినట్లు ఓ యువతి తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒక్కొక్క యువతి దగ్గర అతడు 20 వేల వరకు డబ్బు తీసుకుని కూడా మోసం చేసాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ కేసు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











