twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత దూకుడుతో ఇలియానాకి గుబులు..!

    By Sindhu
    |

    సమంత, ఇలియానాల మధ్య వార్ ఏమిటి అనుకుంటున్నారా..?టాప్ పొజిషన్ లో ఉన్న ఇలియానా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్ని ప్లాప్ కావడంతో కొంచెం డిప్రెషన్ కి లోనైంది. ఈటైమ్ లోనే సమంత తన 'దూకుడు"ను పెంచేసింది. ఇలియానాకి సమంతకి చాలా దగ్గర పోలికలున్నాయి. అవేమిటంటే ఇలియానా మొదటి సినిమా దేవదాసుతో హిట్ కొట్టొంది. అలాగే సమంత మొదటి సినిమా ఏమాయ చేసావె హిట్. ఇలియానా తన రెండో సినిమానే మహేష్ బాబుతో చేస్తే..సమంత మూడో సినిమాకు ఆ ఛాన్స్ దక్కించుకుంది.

    ప్రస్తుతం సమంత మహేష్ బాబు 'దూకుడు" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు బిగ్ సి యాడ్ ని కూడా సమంత దక్కించుకుంది. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాకి ఇలియానా పేరును పరిశీలించినప్పటికీ..ఆ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. అన్ని వైపుల నుంచీ భారీ స్ధాయిలో పోటి ఎదుర్కొంటున్న ఇలియానా ...కోల్పోతున్న డిమాండ్ ని పెంచుకునే క్రమంలో డిస్కౌంట్ ప్యాకేజీ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె తనతో పనిచేసిన, చేద్దామని ఆశపడుతున్న నిర్మాతలుకు మెసేజ్ లుపాస్ చేస్తోందని చెప్తున్నారు. ముఖ్యంగా సమంత దూసుకుపోవటం ఆమెకు మింగుడుపడటం లేదంటున్నారు. కిక్ తప్ప రీసెంట్ గా ఆమెకు హిట్టులు లేవని, సలీం, రెచ్చిపో భాక్సీఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూడటం ఆమె డిమాండ్ ని తగ్గించింది. ఇక ఇలియానా సంగతి అటుంచితే సమంత నటించిన 'దూకుడు" హిట్ అయితే సమంత ఏ రేంజ్ కి వెళుతుందో వెయిట్ అండ్ సీ...

    English summary
    Cat fights between the stars some times goes crazy and serious as well. In past we have many female stars involved in cat fights and gone public. But it seems trend of cat fights is making a swift change and female and male are involving in it now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X