జిగేల్ రాణిగా రాంచరణ్ పక్కన డీజే బేబీ!
Recommended Video

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం. చరణ్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిట్టిబాబుగా రాంచరణ్ తెగ నచ్చేశాడు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ ని జరుపుకుంటోంది. సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఈ చిత్రంలో రాంచరణ్ తో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది.

పూజా అందాల విందు
సాధారణంగా స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడానికి సంశయిస్తారు. అప్పుడప్పుడూ సినిమాకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి హీరోయిన్లు ఐటెం అవతారాలు ఎత్తడం చూస్తూనే ఉన్నాం. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందంటే కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ నెలకొనడం ఖాయం.

స్పెషల్ సాంగ్ కోసం క్యాచీ ట్యూన్
దేవిశ్రీ, సుకుమార్ కాంబినేషన్ అంటే మ్యూజిక్ సూపర్ హిట్ అవడం ఖాయం అనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొని ఉంది. పూజా నర్తించే స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ ని సిద్ధం చేసాడట. జిగేల్ రాణి అంటూ ఈ పాట సాగుతుందని సమాచారం.

కెవ్వు కేక సాంగ్ ని మించేలా
దేవిశ్రీ సంగీతం అందించిన ఐటెం సాంగ్స్ ఎప్పటికీ స్పెషల్ గా మిగిలిపోతాయి. మాస్ ఆడియన్స్ థియేటర్ లలో కేకలు పుట్టించేలా ఉంటాయనడంలో సందేహం లేదు. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక, జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్, ఖైదీ నెం 150 లో రత్తాలు రత్తాలు.. ఇలా మాస్ జనాలని టార్గెట్ చేసి దేవిశ్రీ కంపోజ్ చేసి ఐటెం సాంగ్స్ అదుర్స్ అంతే. జిగేల్ రాణి అంతకు మించి ఉండబోతోందని సమాచారం.

రాంచరణ్ పైనే గురి
చిట్టి బాబు పాత్ర రాంచరణ్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే టీజర్ లో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోందో పరిచయం చేసారు. చరణ్ నటన అద్భుతంగా ఉండడంతో అందిరి గురి చరణ్ పాత్రపైనే ఉంది. చరణ్ నటనని పూర్తిగా ఆస్వాదించాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











