రామ్‌చరణ్‌తో 'చమ్మక్‌ ఛల్లో' పిల్ల ఖరారు

By Srikanya

హైదరాబాద్ : వరుణ్ సందేశ్ 'చమ్మక్‌ ఛల్లో' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన కేరళ కుట్టి కేథరిన్‌. ఆమె వరస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్‌తో కలిసి 'ఇద్దరమ్మాయిలతో'లో ఆడిపాడి,మెగా క్యాంప్ లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన బుక్కైంది.

నాని సరసన 'పైసా'లో చేస్తున్న కేథరిన్ ...త్వరలో రామ్‌చరణ్‌ సరసన నటించబోతున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్‌ ఓ చిత్రం చేయబోతున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఇందులో హీరోయిన్ గా కేథరిన్‌ని ఎంపిక చేసుకొన్నారు.

వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకి 'టాప్‌ లేచిపోద్ది' అనే పేరు పరిశీలనలో ఉంది. బండ్ల గణేష్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసారు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.

మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది.

రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X