‘రుద్రమదేవి’లో కేథరిన్ పాత్ర ఏమిటంటే...

By Srikanya

Catherine Teresa
హైదరాబాద్ : చమ్మక ఛల్లో చిత్రంతో పరిచయమై,ఇద్దరమ్మాయిలతో కుర్రకారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కేథరిన్. ఆమె తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'రుద్రమదేవి'లో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.

ప్రస్తుతం అంతఃపురం సెట్‌లో ఓ పాటను అనుష్కతో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నిత్యామీనన్, కేథరీన్ కూడా నృత్యాలు చేస్తుండడం విశేషం. గత నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. గోనగన్నారెడ్డి ప్రియురాలుగా కేథరీన్ నటిస్తోందని సమాచారం. అయితే గోన గన్నారెడ్డిగా మహేష్‌బాబు నటించనున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే నిత్యా మీనన్ పాత్ర పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఆయన దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమ దేవి. అనుష్క ప్రధాన పాత్రధారి. రానా కీలక పాత్రలో కనిపిస్తారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

గుణ శేఖర్ మాట్లాడుతూ... ''రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది'' అన్నారు. రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, బాబా సెహగల్, నథాలియా కౌర్, జారాషా, హంసా నందిని, మధుమిత, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు, ఆదిత్యా మీనన్, జయప్రకాష్‌రెడ్డి, అతిథి చెంగప్ప, అజయ్, ఆహుతి ప్రసాద్, కృష్ణ భగవాన్, ఎల్.బి.శ్రీరాం, వేణుమాధవ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి మాటలు:పరుచూరి బ్రదర్స్, కెమె రా:అజయ్ విన్సెంట్, పాటలు:సిరివెన్నెల, నిర్మాణం: గుణా టీమ్, దర్శకత్వం:గుణశేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X