ప్రభాస్‌కు అక్కగా.. పవన్‌కు వదినగా.. వీలైతే తెలుగు అబ్బాయితోనే పెళ్లి.. క్యాథరిన్

By Rajababu

Recommended Video

ప్రభాస్‌, పవన్‌కు నో చెప్తున్న కేథరిన్ !

టాలీవుడ్‌లో అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్లలో క్యాథరిన్ త్రెసా ఒకరు. చమ్మక్ చలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి నానితో పైసా, అల్లు అర్జున్‌తో ఇద్దరు అమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న క్యాథిరిన్ ఓ టెలివిజన్ షోలో పాల్గొని ఆమె మనసులోని భావాలను పంచుకొన్నారు. అవి మీ కోసం..

 దుబాయ్‌లో పుట్టాను

దుబాయ్‌లో పుట్టాను

మా అమ్మ, నాన్న దుబాయ్‌లో ఉంటారు. నేను అక్కడే పుట్టాను. కానీ బెంగళూరులో చదువుకొన్నాను. అప్పుడే తొలి చిత్రంలో నటించే అవకాశం లభించింది. నా తొలి చిత్రం దునియా విజయ్ నటించిన శంకర్ ఐపీస్. ఆ తర్వాత మలయాళంలో ఓ సినిమా, తెలుగు, తమిళంలో మరో చిత్రంలో నటించాను.

 దర్శకుడు నీలకంఠం చిత్రం

దర్శకుడు నీలకంఠం చిత్రం

దర్శకుడు నీలకంఠం తెలుగులో చమ్మక్ చలో సినిమాలో అవకాశం ఇచ్చారు. అదే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ పైసా చిత్రంలో నాని పక్కన నటించే అవకాశం ఇచ్చారు.

 తెలుగుపై పట్టు సాధిస్తున్నా..

తెలుగుపై పట్టు సాధిస్తున్నా..

తెలుగులో ఎక్కువ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో భాషపై పట్టు ఉండాలని నేను అనుకొన్నాను. అందుకే తెలుగు భాష నేర్చుకోవడంపై సీరియస్‌గా దృష్టిపెట్టాను. దాంతో సన్నివేశాల్లో మంచిగా హావభావాలు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది.

 అల్లు అర్జున్‌తో మూడు చిత్రాల్లో

అల్లు అర్జున్‌తో మూడు చిత్రాల్లో

అల్లు అర్జున్‌తో మూడు చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో నాకు పూరీ జగన్నాథ్ అవకాశం ఇవ్వగా, రుద్రమదేవిలో గుణశేఖర్, సరైనోడులో బోయపాటి శీను అవకాశం ఇచ్చారు. ఆయ పాత్రలకు నేను సరిగ్గా సరిపోతాననే ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు.

నా కళ్లే ప్లస్ పాయింట్

నా కళ్లే ప్లస్ పాయింట్

నా కళ్లలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది అని నీలకంఠ, కృష్ణవంశీ, బోయపాటి శ్రీను చెప్పారు. వారికి నాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే. అందుకే వారు నా కళ్ల గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు.

 తొలినాళ్లలో చాలా కష్టపడ్డాను

తొలినాళ్లలో చాలా కష్టపడ్డాను

చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చాలా కష్టపడ్డాను. కెమెరా ముందు, పాత్రలో ఒదిగిపోవడానికి ప్రతీ రోజు కసరత్తే చేశాను. ఆ కష్టమే నాకు మంచి ఫలితాలను ఇచ్చింది. నేను రూమర్లను, గాసిప్స్‌ను పట్టించుకోను.

 ప్రభాస్‌కు అక్కగా నటించను

ప్రభాస్‌కు అక్కగా నటించను

ప్రభాస్‌కు అక్కగా నటించాల్సి వస్తే ఒప్పుకొను. పవన్ కల్యాణ్ వదినగా చేయాల్సి వస్తే తిరస్కరిస్తా. సాధారణంగా కథ, పాత్ర మంచిగా ఉంటే నేను ఎవరి పక్కనైనా లవర్‌గా నటించడానికి ఒప్పుకొంటాను.

న్యూ ఇయర్‌లో నిర్ణయాలు

న్యూ ఇయర్‌లో నిర్ణయాలు

న్యూ ఇయర్ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోను. ప్రతీ రోజును ఏ విధంగా చూస్తానో జనవరి 1ను అదే విధంగా నేను చూస్తాను. లాజికల్‌గా ఆలోచిస్తే నేను సరైన దారిలోనే వెళ్తున్నాను. కాబట్టి పెద్దగా మార్పు చేసుకొనే నిర్ణయాలు తీసుకొను.

తెలుగు అబ్బాయిని

తెలుగు అబ్బాయిని

పరభాష నేపథ్యంగా క్యాథరిన్ త్రిసా వచ్చినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతున్నందున తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆలీ సూచించగా ఆమె 100 పర్సెంట్ సరేనని చెప్పింది.

 నచ్చిన వ్యక్తి ఎలా

నచ్చిన వ్యక్తి ఎలా

అయితే నా మనసు నచ్చే అబ్బాయి ఇంకా దొరకలేదు. నా నచ్చిన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కలిస్తే చూద్దాం. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే అబ్బాయిని పెళ్లి చేసుకొంటాను. పెళ్లి ఎప్పుడు చేసుకొంటాననే విషయం ఇప్పుడే చెప్పలేను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X