'ఇద్దరమ్మాయిలతో' లో మంచి మార్కులు పడ్డాయి
అలాగే తన మొదటి సినిమా అనుభవం గురించి చెప్తూ... ఓ ఫ్యాషన్ షోలో నన్ను చూసిన ఓ కన్నడ దర్శకుడు తన సినిమాలో నటించమని అడిగారు. అమ్మానాన్నలకు చెప్పా. నిర్ణయం మీదే అన్నా. రెండ్రోజులు ఆలోచించుకుని 'నీ ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు మేం ఎందుకు కాదనాలి! ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు నటిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు' అన్నారు. 'క్యాథరీన్... క్యా లక్ హై' అనుకుంటూ ఎగిరి గంతేశా అంది.
ఇక దుబాయ్‌లో ఉన్నప్పుడు హిందీ అర్థంకాకపోయినా బాలీవుడ్ సినిమాలు బాగా చూసేదాన్ని. కాజోల్ సినిమాలు విడుదలైన రోజే రెండూ, వీలయితే మూడు షోలు చూసేదాన్ని. ఈ మధ్యనే 'గ్రీన్ పీస్ మూవ్‌మెంట్' స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా చేరిన నేను గిరిజన ప్రాంతాల్లో వంట కోసం చెట్లను నరక్కుండా సౌరశక్తిని ఉపయోగించే దిశగా అవగాహన కల్పిస్తున్నా. అమ్మానాన్నలకు దూరంగా ఉన్నాననే లోటు తప్ప ఇప్పుడంతా హ్యాపీ లైఫ్. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని, నలుగురికీ సాయపడుతూ... భవిష్యత్తులో మిస్ ఇండియా పోటీలకు వెళ్లే అమ్మాయిలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.
నాని సరసన 'పైసా'లో చేస్తున్న కేథరిన్ ...త్వరలో రామ్‌చరణ్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ ఓ చిత్రం చేయబోతున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఇందులో హీరోయిన్ గా కేథరిన్‌ని ఎంపిక చేసుకొన్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకి 'టాప్ లేచిపోద్ది' అనే పేరు పరిశీలనలో ఉంది. బండ్ల గణేష్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసారు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications












