»   » సెక్సీ సోకులతో మతిపొగొడుతున్న కేథరిన్ (ఫోటోలు)

సెక్సీ సోకులతో మతిపొగొడుతున్న కేథరిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఇద్దరమ్మాయిలతో చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ కేథరిన్. ఈ చిత్రంలో కేథరిన్ సెక్సీ ఆటిట్యూడ్, చురుకైన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె గ్లామర్‌కు చాలా మంది ఫిదా అయిపోయారు.

'ఇద్దరమ్మాయిలతో' చిత్రం తర్వాత అమ్మడుకు చాలానే అవకాశాలు వస్తున్నాయి. అయితే టాప్ హీరోయిన్ గా ఎదగాలంటే ఆచితూచి అడుగేయాలి కాబట్టి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే విధంగా ఎలాంటి దర్శకులు, హీరోలతో పని చేస్తే భవిష్యత్ బాగుంటుందనే విషయంలోనూ కేర్ ఫుల్‌గా ఉంటోంది.

ఇద్దరమ్మాయిలతో చిత్రం తర్వాత కేథరిన్....'పైసా' చిత్రంలో నటిస్తోంది. నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నాడు. అయితే జనాల్లో పాలోయింగ్ పెంచుకునేందుకు తన గ్లామరస్ ఫోటో షూట్లలో పాల్గొంటూ సెక్సీ ఒంపుసొంపులతో అభిమానులకు గిలిగింతలు పెడుతోంది.

కేథరిన్ పూర్తి పేరు...కేథరిన్ త్రెసా అలెగ్జాండర్, మళయాలీ కేథలిక్ కుటుంబంలో జన్మించింది.

కేథరిన్ తల్లిదండ్రులు ఆమె పుట్టకముందే దుబాయ్‌కి షిప్ట్ అయ్యారు. ఆమె అక్కడే పుట్టి పెరిగింది.

దుబాయ్ లో గ్రేడ్ 12 వరకు చదివిన తర్వాత ఆ పై చదువుల నిమిత్తం కేథరిన్ బెంగుళూరు వచ్చింది. ఇక్కడి సెయంట్ జోసెప్ కాలేజీలో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది.


గ్యాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే మోడలింగుపై ఆసక్తిపెంచుకున్న కేథరిన్...అభిరుచికి తగిన విధంగా ఆ రంగంలో అడుగు పెట్టింది.


మోడలింగు ద్వారా...నల్లి సిల్క్స్, చెన్నై సిల్క్స్, ఫాస్ట్ ట్రాక్, జాస్కో జ్యెవెల్లర్స్, డెక్కన్ క్రానికల్ లాంటి సంస్థ తరుపున వ్యాపార ప్రకటనలో నటించింది.


బెంగుళూరులో కెరీర్ మొదలు పెట్టడంతో ఆమెకు కన్నడ చిత్రం ‘శంకర్ ఐపీఎస్'లో హీరోయిన్ గా తొలిఅవకాశం దక్కింది. ఆ తర్వాత మళయాలంలో ఒకటి, కన్నడంలో మరో రెండు చిత్రాలు చేసింది.


చమ్మక్ చల్లో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కేథరిన్ ఆ వెంటనే అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం నాని సరసన ‘పైసా' చిత్రం చేస్తోంది.

English summary
Catherine Tresa is an Indian film actress and model, known for her works in South Indian film industry. Since 2010, She has acted in Kannada, Malayalam and Telugu films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu