‘ఇద్దరమ్మాయిలతో' కేథరిన్ థెరిసా కి మరో బిగ్ ఆఫర్
ఇక ఆ మధ్య ఆమె రభస చిత్రంలో సెకండ్ హీరోయిన్ అని ప్రచారం జరిగింది కానీ..అది నిజం కాదు అని తెలిసిందే. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం తర్వాత అమ్మడుకు చాలానే అవకాశాలు వస్తున్నాయి. అయితే టాప్ హీరోయిన్ గా ఎదగాలంటే ఆచితూచి అడుగేయాలి కాబట్టి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే విధంగా ఎలాంటి దర్శకులు, హీరోలతో పని చేస్తే భవిష్యత్ బాగుంటుందనే విషయంలోనూ కేర్ ఫుల్‌గా ఉంటోంది.
ఇద్దరమ్మాయిలతో చిత్రం తర్వాత కేథరిన్....'పైసా' చిత్రంలో నటిస్తోంది. నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నాడు. అయితే జనాల్లో పాలోయింగ్ పెంచుకునేందుకు తన గ్లామరస్ ఫోటో షూట్లలో పాల్గొంటూ సెక్సీ ఒంపుసొంపులతో అభిమానులకు గిలిగింతలు పెడుతోంది. కేథరిన్ పూర్తి పేరు...కేథరిన్ త్రెసా అలెగ్జాండర్, మళయాలీ కేథలిక్ కుటుంబంలో జన్మించింది. కేథరిన్ తల్లిదండ్రులు ఆమె పుట్టకముందే దుబాయ్‌కి షిప్ట్ అయ్యారు. ఆమె అక్కడే పుట్టి పెరిగింది.


Click it and Unblock the Notifications












