మందు కొట్టిన సినీస్టార్స్, శ్రీదేవి కూతురు సైతం! (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ సెలబ్రిటీలు పార్టీలు, పబ్బులు అంటూ తిరగడం కామన్ అయిపోయింది. బాలీవుడ్‌లో ఈ సంస్కృతి చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. ఈ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన చాలా మంది స్టార్స్ మద్యం సేవించడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇలా పార్టీల్లో మందేస్తూ కెమెరాకు చిక్కిన పలువురు సెలబ్రిటీల ఫోటోలు బయటకు లీకై హల్ చల్ చేస్తున్నాయి.
గత కొన్ని రోజుల క్రితం శ్రీదేవి కూడాతురు ఝాన్వి కపూర్ ఫోటోలు కూడా హల్ చల్ చేసాయి. ఆమె ఫోటోలు చూస్తే ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోట్లో కొన్ని ఆమె స్వయంగా తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఝాన్వి కపూర్ బిగ్ పార్టీ యానిమల్ అనే విషయం కొత్త కాక పోయినా....ఆమె తాగుబోతు అవతారాన్ని పలువురు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె వయసుకు మించి ప్రవర్తిస్తుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
గతంలో కూడా పలువురు బాలీవుడ్ స్టార్ల పిల్లలు ఇలా పార్టీల్లో మందు కొడుతూ కెమెరాకు చిక్కారు. గతేడాది అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో కూడా పలువురు స్టార్స్ మందు కొట్టారు. అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ మొతాదుకు మించి మందు కొట్టి కెమెరాకు చిక్కారు. ఇలా చాలా సందర్భాల్లో బాలీవుడ్ స్టార్ష్ మందు కొడుతూ చిక్కారు.... స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు

సోనమ్ కపూర్
పార్టీలో సోనమ్ కపూర్ డ్రంక్ అవతార్. ఫ్రెండ్స్‌తో కలిసి సోనమ్ కపూర్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

విద్యా బాలన్
బాలీవుడ్ ప్రముఖ తారల్లో ఒకరైన విద్యా బాలన్ ఓ పార్టీలో షాంపైన్ తాగుతూ ఇలా కెమెరాకు చిక్కారు.

అర్జున్ కపూర్, రణవీర్ సింగ్
అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురూ మొతాదుకు మించిన తాగినట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్
రణబీర్ కపూర్, కత్రినా కైప్ ఏకంగా కారులోనే దుకాణం ఓపెన్ చేసారు.

సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ పార్టీలో ఇలా మందేసి కనిపించారు.

ఝాన్వి కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ అవతారం చూస్తుంటే ఆమె డ్రింక్ చేసి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు.

హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ కళ్లు చూసారా ఎంత మత్తుగా ఉన్నాయో! చూస్తుంటే చుక్కేసినట్లు స్పష్టమవుతోంది.

షారుక్ ఖాన్
ఈ ఫోటో సంజయ్ దత్ ఇంట్లో జరిగిన పార్టీకి సంబంధించినది. పార్టీలో షారుక్ ఖాన్ కంట్రోల్ తప్పాడు. ఫరా ఖాన్ భర్త శిరీష్ కుందర్‌తో గొడవ పడ్డాడు.

అమీషా పటేల్
హీరోయిన్ అమీషా పటేల్ పార్టీలో మందు కొడుతున్న దృశ్యం.

మనీషా కొయిరాలా
హీరోయిన్ మనీషా కొయిరాల ఆ మధ్య అతిగా మధ్యం సేవించి మీడియాకు చిక్కారు.


Click it and Unblock the Notifications











