»   » తండ్రి వార్నింగ్ ఇచ్చినా, ఆంటిపై మోజు వదలుకోలేక,ఇంట్లోనే దొరికిపోయాడు

తండ్రి వార్నింగ్ ఇచ్చినా, ఆంటిపై మోజు వదలుకోలేక,ఇంట్లోనే దొరికిపోయాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్...గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అంటూ రెచ్చిపోయిన మలైకా అరోరా ఖాన్ గుర్తుందా. అబ్బ ఈ వయస్సులోనూ ఈ స్దాయిలో దుమ్ము రేపిందే అని అప్పట్లో మాట్లాడుకున్నాం. ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి ఏ పాటకో డాన్స్ చేసిన స్టెప్ ల గురించి కాదు...మిడ్ నైట్ మసాలా యవ్వారంతో...అదేంటి అంటారా అయితే ఈ కథనం చదవండి మరి.

బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ విడాకుల వరకు వెళ్లడానికి యువ హీరో అర్జున్ కపూర్ కారణమంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. మలైకాకు, అర్జున్ తో ఎఫైర్ ఉందని, అందువల్లే అర్బాజ్ తో విభేదాలు వచ్చాయని వార్తలు అంతటా వచ్చాయి. ఊరుకోండి ఇలాంటి రూమర్స్ లేపటంలో వెబ్ సైట్స్ వారు ముందు ఉంటారు అంటూ వెబ్ మీడియాను అంతా దుమ్మెత్తి పోసారు.

ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు ఇద్దరూ ప్రకటన కూడా చేశారు. అయితే మధ్యవర్తుల జోక్యంతో మలైకా, అర్బాజ్ విడాకులకు దరఖాస్తు చేయకుండా కొంతకాలం వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ లోగా మరొకటి వచ్చి పడింది. ఈవిడ గారి అర్దరాత్రి ఓ కుర్ర హీరోతో వ్యవహారం వెలుగులోకి వచ్చి హవ్వ అని నోరు నొక్కుకునేలా చేసింది. అదేంటి అంటారా...

ఆ టైమ్ లో ఆ హీరోకు అక్కడ పనేంటి

ఆ టైమ్ లో ఆ హీరోకు అక్కడ పనేంటి

కాగా మంగళవారం అర్ధరాత్రి మలైకా ఇంటి నుంచి హీరో అర్జున్ కపూర్ బయటకు రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందని బాలీవుడ్ మీడియా అంటోంది. అసలు ఆ కుర్రాడికి అంత రాత్రిపూట ఆమె ఇంటి దగ్గర పనేంటి..వేరే వ్యవహారం కాకపోతే అని అంటున్నారు.

రాత్రి ఒంటిగంట దాటాక ఆమె ఇంట్లోంచి

రాత్రి ఒంటిగంట దాటాక ఆమె ఇంట్లోంచి

కొంతకాలంగా మలైకా భర్త అర్బాజ్ కు దూరంగా కొడుకుతో కలసి వేరుగా ఉంటోంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అర్జున్ కపూర్... మలైకా ఇంటికి వెళ్లి, అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బయటకు వచ్చాడు. ఇది అందరికీ షాక్ ఇచ్చింది. అసలు అంతదాకా ఆమె ఇంట్లో ఈ కుర్ర హీరో ఏం చేసాడు అంటోంది.

ఆ సంభంధం ఉన్నట్లు కన్ఫర్మ్

ఆ సంభంధం ఉన్నట్లు కన్ఫర్మ్

మలైకా ఉంటున్న అపార్ట్ మెంట్ నుంచి కారులో అర్జున్ బయటకు వస్తున్నప్పటి దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతున్నట్టు పుకార్లు కు ఊతమిచ్చినట్లు అయ్యింది. ఎఫైర్ లేకపోతే అంత రాత్రి వేళ ఆమె ఇంట్లో ఈ బాబుగారికి ఏం పని అని ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా

గతంలో కూడా

కొన్ని నెలల క్రితం కూడా అర్జున్ మలైకా ఇంటి దగ్గర కనిపించినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అప్పుడు కూడా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ అందరికీ తమ విషయం తెలుస్తోంది అని తెలిసినా ఎందుకు వీళ్లు ఇలా చేస్తున్నారు అనేది ప్రశ్నగా మిగిలింది.

ఒకటయ్యారు అనుకున్నారు

ఒకటయ్యారు అనుకున్నారు

ఇటీవల అర్భాజ్, మలైకా కుటుంబ సభ్యులతో కలసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లాడు. దీంతో ఇద్దరూ మళ్లీ దగ్గరయినట్టు సన్నిహితులు భావించారు. సల్మాన్ సైతం చాలా సంతోషించాడు. కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు. ఆమె తన బుద్దిని మార్చుకోలేదు అంటున్నారు.

భార్య సీక్రెట్ ఎఫైర్స్ తో విసిగి

భార్య సీక్రెట్ ఎఫైర్స్ తో విసిగి

ఈ బాలీవుడ్ భామ తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకోగా, అది కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ వీరిద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం మాత్రం అర్బాజ్ లైఫ్‌లో సెటిల్ అవ్వకపోవడమే అని కొందరు అంటున్నా.. మరో పక్క మలైకా సీక్రెట్ ఎఫైర్స్ వల్లనే విడిపోయారని ఇంకొందరు అంటున్నారు.

రాత్రింతా గడిపాడంటే..

రాత్రింతా గడిపాడంటే..

ఈ నేపథ్యంలో మలైకా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి అర్థరాత్రి కుర్రహీరో అర్జున్ కపూర్ వెళ్లాడని ఆమె ఇంట్లోనే రాత్రంతా గడిపాడని పార్టీ చేసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. అప్పుడు ఈ విషయంపై ఇద్దరిని సంప్రదిస్తే మలైకా - అర్జున్ కపూర్‌లు అలాంటిదేమీ లేదంటూ తోసిపుచ్చేశారు. కానీ ఇప్పుడు ఫొటోలుకూడా రికార్డ్ అయ్యాయి. ఏం సమాధానం చెప్తారో చూడాలి.

ఆవిడ జోలికి వెల్తే బాగోదు

ఆవిడ జోలికి వెల్తే బాగోదు

ఈ విషయం తెలిసిన అర్జున్ తండ్రి, నిర్మాత బోనీకపూర్.. మలైకాకు దూరంగా ఉండాల్సిందిగా కొడుకును హెచ్చరించాడని, అర్బాజ్ సోదరుడు సల్మాన్ తో విభేదాలు వద్దని సూచించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ యంగ్ హీరో...లైట్ తీసుకున్నాడంటున్నారు.

తండ్రి అప్పుడు, కొడుకు ఇప్పుడు

తండ్రి అప్పుడు, కొడుకు ఇప్పుడు

అర్భాజ్ ఖాన్‌ నుంచి మలైకా విడిపోయేందుకు కారణం మొదట బోనీ కపూర్‌తో ఇల్లీగర్ కాంటాక్టే అని వార్తలొచ్చాయి. అయితే బోనీ కపూర్‌తో కూడా సంబంధాలు తెంచుకున్న మలైకా అరోరా.. తన కుమారుడితో కలిసి ముంబైలోని ఖర్‌లో నివాసం ఉంటోంది. తాజాగా మలైకా బోనీ కపూర్ సన్ అర్జున్ కపూర్‌తో ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తూండటంతో అంతా షాక్ అవుతున్నారు.

ఇలా రెడ్ హ్యాండెడ్

ఇలా రెడ్ హ్యాండెడ్

నిన్న మొన్నటి వరకు ఇద్దరి మధ్య ఎఫైర్ అనేది రూమర్ గానే ఉంది. తాజాగా ఇద్దరూ అర్థరాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోవడం హాట్ టాపిక్ అయింది. అర్జుర్ కపూర్ అర్థరాత్రి రహస్యంగా ముంబైలోని ఖర్‌లో మలైకా నివాసం ఉంటున్న ఫ్లాటుకు రావటం, వెళ్లటం మొత్తం రికార్డ్ అయ్యి ఫొటోలు రావటం ఇరుకున పడేస్తోంది.

అప్పటినుంచే ఈ ప్రేమ జంట క్లోజ్ గా..

అప్పటినుంచే ఈ ప్రేమ జంట క్లోజ్ గా..

మలైకా, అర్జున్ పలు టీవీ షోలలో కలిసి పార్టిసిపేట్ చేసారు. అలా ఇద్దరి హధ్య పరిచయం ఏర్పడిందట. క్లోజ్ గా మూవ్ ఇద్దరూ పలు సందర్భాల్లో క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ఆకర్షణ ఏర్పడిందని టాక్.

సరిసరి తండ్రి మాత్రం..అలాంటోడు కాదా

సరిసరి తండ్రి మాత్రం..అలాంటోడు కాదా

అసలు తన తండ్రి బోనీ కపూర్ మొదటి భార్య ఉండగానే.. ఇంట్లో ఏదో కాస్త చోటు ఇచ్చినట్లే ఇచ్చి శ్రీదేవిని పెళ్ళి చేసుకున్నాడు . ఇప్పటికే శ్రీదేవి పేరు ఎత్తితే అర్జున్ కపూర్ కు ఒళ్లు మండిపోతుంది. అవకాసం దొరికితే సెటైర్లు కూడా వేస్తుంటాడు. అలాంటప్పుడు బోనీ చెబితే అర్జున్ ఈ ఎఫైర్ ను పక్కనెట్టేస్తాడా? అంటున్నారు.

అబ్బబ్బే నేను అలాంటి దాన్ని కాదు

అబ్బబ్బే నేను అలాంటి దాన్ని కాదు

మలైకా అరోరా తనపై వస్తున్న రూమర్లను గతంలో కొట్టి పడేసింది ,నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదని క్లోజ్ గా ఉన్నంత మాత్రాన అర్జున్ కపూర్ తో ముడి పెట్టడం భావ్యం కాదని అంటోంది. తగ కొన్ని రోజులుగా యువ హీరో అర్జున్ కపూర్ తో హాట్ భామ మలైకా అరోరా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం తో స్పందించిన మలైకా వాటిని ఖండించింది.

ఫొటోలే సాక్ష్యం కదా

ఫొటోలే సాక్ష్యం కదా

మరి ఇన్నాళ్లూ రూమర్స్ నాపై ప్రచారం చెయ్యకండీ అంటూ చెప్తూ వచ్చిన మలైకా..ఇప్పుడు ఈ ఫొటోలకు ఏం సమాధానం చెప్తుంది అంటోంది బాలీవుడ్ మీడియా. కాకపోతే తెగించిన వారికి ....అన్న సామెతలా..ఏదో ఒకటి ఇప్పటికి మైండ్ లో ఫిక్సై ఉంటుది కదా ఆమె .

కుర్ర హీరో కెరీర్ కు ఏమన్నా

కుర్ర హీరో కెరీర్ కు ఏమన్నా

ఈ ఎఫైర్ లో ఎక్కువగా మాట్లాడుకునేది అర్జున్ కపూర్ గురించి. మరి సల్మాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ యంగ్ హీరోకు వార్నింగ్ గట్రా ఇస్తాడని ఓ ప్రక్కన జోరుగా ప్రచారం జరుగుతూంటే..అంత సీన్ లేదు..తన మరదలు గురించి సల్మాన్ కు తెలియదా...అయినా బోనీ ఫ్యామిలితో సల్మాన్ కు మంచి రిలేషన్ ఉంది. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు అంటున్నారు.

English summary
One can see in the video, Arjun dropped by Malaika Arora Khan’s building by 10:30 pm and left by midnight 1:30 am, where she is staying separately after her separation with Arbaaz Khan. Well, this is not for the first time; Arjun Kapoor has been spotted many times at Malaika’s building.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu