twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజుకుంటున్న టాలీవుడ్ వివాదం.... ఆ సినిమా పై ఎందుకీ నిషేదం...???

    ఒకసినిమా నిషేదం పై టాలీవుడ్ లో వివాదం జరుగుతోంది. సినిమాలో ఉన్న అంశాలను తొలగించమని చెప్పకుండా ఏకంగా సినిమానే బ్యాన్ చేయటం పై సోషల్ మీడియాలో కూదా సినిమా నిర్మాత, దర్శకులకు మద్దతుగా పోస్టులు .

    |

    ఒకసినిమా నిషేదం పై టాలీవుడ్ లో వివాదం జరుగుతోంది. సినిమాలో ఉన్న అంశాలను తొలగించమని చెప్పకుండా ఏకంగా సినిమానే బ్యాన్ చేయటం పై సోషల్ మీడియాలో కూడా సినిమా నిర్మాత, దర్శకులకు మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి... రాజ్యాగంలో పొందుపరచిన అంశాల గురించి ప్రజలకు తెలియజెయ్యాలనే ఉద్దేశంతో సినిమా తీస్తే,

    శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ సెన్సార్‌ బోర్డ్‌ నిరంకుశంగా వ్యవహరించి సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించిందని 'శరణం గచ్ఛామి' దర్శక నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి నిర్మించిన చిత్రం 'శరణం గచ్ఛామి'.

    జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌:

    జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌:

    నవీన్ సంజయ్‌, తనిష్క్‌ తివారి జంటగా నటించిన ఇందులో పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌, బీసీ సంఘం నాయకులు ఆర్‌. కృష్ణయ్య వంటివాళ్లూ కీలక పాత్రలు చేసారు. సోమవారం నిర్మాతల మండలి హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత మురళి మాట్లాడుతూ

    శాంతి భద్రతల సమస్య :

    శాంతి భద్రతల సమస్య :

    ‘‘డాక్టరేట్‌ పొందిన నేను, ఎంతో పరిశోధనచేసి తయారుచేసిన సబ్జెక్టుతో ఈ సినిమా నిర్మించాను. గత డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపితే, జనవరి 2న సెన్సార్‌ సభ్యులు చిత్రాన్ని చూశారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందనీ, అల్లర్లు చెలరేగుతాయనీ,

    సెన్సార్‌ ఆఫీసర్‌:

    సెన్సార్‌ ఆఫీసర్‌:

    అందువల్ల సర్టిఫికెట్‌ను నిరాకరిస్తున్నామనీ తెలియజేస్తూ సెన్సార్‌ ఆఫీసర్‌ పంపిన ఉత్తరం 22న పోస్ట్‌ ద్వారా అందడంతో షాకయ్యాం. ఏ నిబంధనల కింద సర్టిఫికెట్‌ నిరాకరిస్తున్నారో సెన్సార్‌వాళ్లు చెప్పలేదు. కావాలంటే రివిజన్ కమిటీకి వెళ్లమని సలహా ఇస్తున్నారు. ఇలా అయితే కొత్త నిర్మాతలు ఎలా వస్తారు? ఈ విషయంలో న్యాయం కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సిద్ధం'' అని తేల్చి చెప్పారు.

     రిజర్వేషన్ల అంశంపై:

    రిజర్వేషన్ల అంశంపై:

    ‘‘ఇది ఓ జర్నలిస్ట్‌ కథ. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల అంశంపై పీహెచ్‌డీ చేయాలనుకున్న అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథాంశం. సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ఈ సినిమా చూపిస్తే, చాలా బాగుందని మెచ్చుకున్నారు.

    కొత్త ప్రయోగాలు:

    కొత్త ప్రయోగాలు:

    ఆ ఉత్సాహంతో సెన్సార్‌కు వెళ్తే ఊహించని అనుభవం ఎదురైంది. ఏవైనా సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరమైతే చెప్పమని అడిగితే, మొత్తం సినిమానే అభ్యంతరకరంగా ఉందనీ, సినిమాలో కులాల గురించి చెప్పారనీ, దీనివల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందనీ అన్నారు. తమిళ, మలయాళ భాషల్లో కొత్త ప్రయోగాలు చేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతున్నారు.

    దర్శక నిర్మాతలు :

    దర్శక నిర్మాతలు :

    తెలుగులో అలాంటి ప్రయోగాలు రాకపోవడానికి ఇలాంటి సెన్సార్‌ విధానాలే కారణం. సమాజానికి మేలుచేసే సినిమా తియ్యకూడదా? రాజ్యాంగంలో చెప్పిన విషయాల గురించే సినిమా తీస్తే, అది నిషేధం ఎందుకవుతుంది?'' అని దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ ప్రశ్నించారు. ‘శరణం గచ్ఛామి' దర్శక నిర్మాతలు

    English summary
    The Central Board of Film Certification has refused to issue a censor certificate to a Telugu movie based on caste-based reservations because it was “likely to affect public order and disrupt peace”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X