విశ్వరూపం 2కి మరో దెబ్బ.. బెడ్‌పై పూజ, కమల్ హాసన్..లిప్ లాక్ సీన్, భారత మాత డైలాగ్ తీవ్ర వివాదం!
Recommended Video

లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో ఆయన చుట్టూ అదేస్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. సినీరాజకీయ వ్యవహారాల్లో కమల్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. తాజగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే విశ్వరూపం2 చిత్రానికి మిక్స్డ్ టాక్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు వాళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ విభాగం
కమల్ హాసన్ ఈ చిత్రం భారత ఇంటెలిజెన్స్ విభాగం ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడు. విశ్వరూపం తొలి భాగానికి ఇది కొనసాగింపు. పూజ కుమార్ కమల్ హాసన్ భార్య పాత్రలో నటించింది. టెర్రరిజం నేపథ్యంలో సినిమా కాబట్టి సాధారణంగానే భారీ స్థాయిలో హింస ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ జరీ చేసారు.

వేరు వేరుగా
ఈ చిత్ర విడుదలకు ముందు సెన్సార్ సభ్యులు హిందీ వెర్షన్ కు 12 కట్స్, తమిళ్ వర్షన్ కు 22 కట్స్ ప్రతిపాదించారు. ఒకే చిత్రానికి ఇలా రెండు విధాలుగా వ్యవహరించడం ఆశ్చర్యపరిచే అంశమే. విడుదుల తరువాత కూడా ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు పంజా విసరనున్నారు.

భారత మాత డైలాగ్
ఈ చిత్రంలో హీరోయిన్ పూజ కుమార్ చెప్పే భారత మాత డైలాగ్ వివాదాస్పదం కావొచ్చని ఉద్దేశంతో మ్యూట్ చేసి ప్రదర్శించాలని సెన్సార్ సభ్యులు ఆదేశించినట్లు తెలుస్తోంది. సౌత్ బ్లాక్, అల్లా, పాకిస్థాన్ వంటి పదాలని కూడా మ్యూట్ చేయాలనీ సెన్సార్ సభ్యులు సూచించారట.

రొమాంటిక్ సీన్
కమల్ హాసన్, పూజ కుమార్ బెడ్ పై రొమాంటిక్ సన్నివేశం కూడా తొలగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కమల్, పూజ మధ్య సాగే లిప్ లాక్ సన్నివేశం కూడా కట్ చేయాలని ఆదేశించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ చిత్రంలో మరో రెండు లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వాటికి మాత్రం సెన్సార్ సభ్యులు అడ్డు చెప్పలేదు.

విదేశీ ఏజెన్సీ
ఈ చిత్రంలో విదేశీఏజెన్సీలకు సంబందించిన కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మ్యూట్ చేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా మొత్తం మ్యూట్ చేసుకుంటూ పోతో ఇక డైలాగ్స్ ఏముంటాయి అనే విమర్శ కూడా ఎదురవుతోంది.


Click it and Unblock the Notifications











