లక్ష లంచంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ సెన్సార్ ఆఫీసర్
సినిమాకి తక్కువ కట్స్ తో సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తానంటూ లక్ష రూపాయలు లంచం అడిగి సిబిఐ వలలో ఇరుక్కున్న సెన్సార్ ఆఫీషియల్ ఉదంతం ఇది. అయితే ఈ సంఘటన ఆంద్రాలో కాదు..తమిళనాడులో జరిగింది. డి.రాజశేఖరన్ (1998 ఐఎప్ ఎస్ బ్యాచ్) సెన్సార్ అఫీషియల్ గా నియమితులయ్యారు. ఆయన తాజాగా కాదల్ సొల్ల వందన్ అనే చిత్రం సెన్సార్ చేసారు. అయితే ఆ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని పట్టుపట్టారు. దాంతో నిర్మాత జయకుమార్..ఏమీ చేయలేని సిట్యువేషన్ లో సిబీఐ..లోని ఏంటి కరెప్షన్ వింగ్ కు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే సిబీఐ వారు స్పందించి రెడ్ హ్యాండెడ్ గా నిన్న(బుధవారం) రాజశేఖరన్ ని పట్టుకుని అరెస్ట్ చేసారు. ఇక సెన్సార్ మెంబర్ ఇలా ఇటువంటి కేసులో అరెస్టు అవటం ఇదే మొదటి సారి అంటున్నారు. అయితే తెలుగులోనూ లంచం ఇచ్చే సంస్కృతి ఉన్నా అది బయిటకు చెప్పుకోలేని పరిస్ధితులో ఉంటోందని, అంత ఖర్చుపెట్టి సినిమా తీసి చివరి నిముషాల్లో సెన్సార్ తో తగువు పెట్టుకోవటం ఇష్టం లేక చాలా మంది డబ్బు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తున్నామని కొందరు ఈ వార్త విని వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











