ఏప్రిల్ 28న జియా ఖాన్ సూసైడ్ కేసులో తుది తీర్పు.. సూరజ్ పంచోలికి శిక్ష తప్పదా?

బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ సూసైడ్ కేసు విచారణ తుది దశకు చేరుకొన్నది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన జియా ఖాన్ అనుమానాస్పద మృతిపై సీబీఐ కోర్టు తుది తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరజ్ పంచోలికి శిక్ష పడుతుందా? అతడిని నిర్దోషిగా పేర్కొంటారా? అనే ప్రశ్నలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చర్చనీయాంశమయ్యాయి. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ద్ చిత్రం ద్వారా భారతీయ సినిమా పరిశ్రమలోకి జియా ఖాన్ అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన కెరీర్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే సూరజ్ పంచోలితో డేటింగ్ చేసిందనే వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది.

CBI court to pronounce judgement on Jiah Khans abetment to Suicide against Sooraj Pancholi

జియా ఖాన్ ముంబైలోని జుహులోని తన ఫ్లాట్‌లో 2013 సంవత్సరం జూన్ 3వ తేదీన విగత జీవిగా కనిపించింది. ప్రాథమిక విచారణ తర్వాత జియా ఖాన్ మరణాన్ని సూసైడ్‌ కాదని కొట్టి పడేశారు. సూసైడ్ లెటర్ ఆధారంగా హీరో సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. జియా ఖాన్ రాసిన ఆరు పేజిల సూసైడ్ లెటర్‌ ఆధారంగా ఆమె హత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.

దేశవ్యాప్తంగా సంచలనం కావడం, ఆమె మరణం కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు వచ్చాయి. ముంబై సెషన్స్ కోర్టు మా పరిధిలోకి రాదని చేతులెత్తేయడంతో జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో కీలక సాక్షిగా జియా ఖాన్ తల్లి రబీనా ఖాన్‌ను సీబీఐ పరిగణించింది. అయితే తన కూతురుది సూసైడ్ కాదు.. హత్య అంటూ ఆమె మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

జియా ఖాన్ తల్లి రబీనా ఖాన్‌ను పలు దఫాలుగా సీబీఐ విచారించింది. విచారణలో భాగంగా సీబీఐకి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. నా కూతురును శారీరకంగా వాడుకోవడం కాకుండా.. ఆమెను మాటలతో హింసించారు అని కొన్ని ఆధారాలు సీబీఐకి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

అయితే సుదీర్ఘకాలంగా సాగిన సీబీఐ విచారణ, కోర్టు ప్రోసీడింగ్స్ అనంతరం.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి తన తీర్పును వెల్లడిస్తూ.. ఈ కేసు విచారణలో భాగంగా వాదోపవాదనలు ముగిసాయి. సీబీఐ వర్సెస్ సూరజ్ పంచోలి కేసులో వాస్తవాలు, కేసు విచారణలో పురోగతి సాధించిన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకొంటుంది. ఈ కేసు తుది తీర్పును ఏప్రిల్ 28వ తేదీన వెల్లడిస్తామని న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ చెప్పడంతో ఈ కేసు తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X