twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ సింగ్ సూసైడ్‌ కేసు.. సీబీఐ విచారణ డిమాండ్‌కు ఒత్తిడి.. రంగంలోకి అమిత్ షా!

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ వర్గాలు ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తకు డిమాండ్ చేస్తున్నారు. కేవలం రాజకీయ, సినీ వర్గాల కాకుండా పలు సామాజిక సంస్థలు కూడా సుశాంత్ కేసు దర్యాప్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత నెలరోజులుగా జరుగుతున్న సుశాంత్ సింగ్ కేసు దర్యాపు ముగింపు దశకు చేరుకొన్న క్రమంలో సిబీఐ డిమాండ్‌కు ఊపందుకొన్నది. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నేత రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించడంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Sushant Singh Rajput కేసు CBI Investigation పై స్పందించిన Amit Shah || Oneindia Telugu
    సిబీఐ డిమాండ్ అంటూ రూపా గంగూలీ, సుబ్రమణ్యస్వామి

    సిబీఐ డిమాండ్ అంటూ రూపా గంగూలీ, సుబ్రమణ్యస్వామి

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై బీజేపీ ఎంపీ, సినీ నటి రూపా గంగూలీ పలు అనుమానాలు వ్యక్తం చేసి సీబీఐ విచారణకు దర్యాప్తు చేసిన తర్వాత మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా అదే వాదనను లేవనెత్తారు. దాంతో ఈ కేసు దర్యాప్తు వ్యవహారం మరోసారి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. సుశాంత్ కేసునే కాకుండా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ఆస్తులు, దుబాయ్ ఉన్న వారి సంపద గురించి కేంద్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే.

    తాజాగా పప్పుయాదవ్ లేఖ

    తాజాగా పప్పుయాదవ్ లేఖ

    ఇక బీహార్‌కు చెందిన జన్ అధికార్ పార్టీ నేత పప్పు యాదవ్ తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మృతి కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించాలి అని పప్పు యాదవ్ లేఖలో పేర్కొన్నారు. పప్పు యాదవ్ లేఖపై అమితా స్పందిస్తూ తిరిగి లేఖ రాశారు.

    అమిత్ షా స్పందన, లేఖ

    అమిత్ షా స్పందన, లేఖ

    జన్ అధికార్ పార్టీ నేత పప్పుయాదవ్ లేఖకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. జూన్ 16వ తేదీన సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని, వారితో విచారణ జరిపించాలని కోరుతూ రాసిన లేఖ అందింది. సీబీఐ దర్యాప్తు అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో లేదు. సీబీఐ విభాగం కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని పరిశీలనలోకి తీసుకోవాలని సిఫారసు చేశాను అని అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు.

    అమిషా జీ.. మీరు తలచుకొంటే..

    అమిషా జీ.. మీరు తలచుకొంటే..

    అమిత్ షా రాసిన లేఖను ట్విట్టర్‌లో పప్పు యాదవ్ షేర్ చేశారు. అమిత్ షా గారు.. మీరు తలచుకొంటే సుశాంత్ సూసైడ్ కేసును సీబీఐ విచారణకు అప్పగించడం నిమిషంలో జరిగే పని. దయచేసి మా వినతిని పరిగణనలోకి తీసుకోండి అంటూ పప్పుయాదవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ సింగ్ మరణం బీహార్ ప్రతిష్టకు సంబంధించిన అంశం అంటూ లేఖలో వెల్లడించారు.

    ఇప్పటి వరకు 35 మందిని ప్రశ్నించిన ముంబై పోలీసులు

    ఇప్పటి వరకు 35 మందిని ప్రశ్నించిన ముంబై పోలీసులు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల జరుపుతున్న విచారణ ముగింపు దశకు చేరుకొన్నది. ఇప్పటి వరకు 35 మందిని ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. త్వరలోనే తుది నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించేందుకు బాంద్రా పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాలతోపాటు సోషల్ మీడియా నుంచి సీబీఐ విచారణ జరిపించాలనే ఒత్తిడి తీవ్రతరమైంది.

    English summary
    Jan Adhikar Party chief Pappu Yadav demands CBI investigation on Sushant Singh Rajput suicide. In this occassion, Amit Shah responded to pappa yadav letter and he transerred letter to DoPt to look into this matter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X