twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బడా(దిల్ రాజు, అల్లు.., సురేష్ బాబు...)నిర్మాతలను సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి...?

    By Sindhu
    |

    చిన్న నిర్మాత మండలి అధ్యక్షడు నట్టి కుమార్ పెద్ద నిర్మాతలపై విరుచుకు పడ్డారు. 'ఐదారుగురు(దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్వినీదత్......) పెద్దమనుషుల చేతిలో సినీ పరిశ్రమ వుంది. అగ్ర నిర్మాతలుగా చెలామణి అవుతున్న వారు సర్వీస్ టాక్స్, వినోదపు పన్ను కట్టకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అలాంటి వారు 45 రోజుల్లో అన్ని పన్నులు కట్టాలి. లేకుంటే సమాచార హక్కు చట్టం కింద అన్ని వివరాలు సేకరించి వారిపై కోర్టులో కేసు వేస్తా. సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కోరతా" అని నిర్మాత నట్టికుమార్ హెచ్చరించారు. న్యాయపోరాటం చేసి వారి భరతం పడతానని హెచ్చరించారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు.

    తాను కొన్ని థియేటర్లను లీజుకు తీసుకొని వాటిలో కొన్ని సౌకర్యాలు కల్పించాను. ఇప్పుడు ఆ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు బడా నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. దీనివల్ల ఎగ్జిబిటర్లు బాధపడుతున్నారు. ఆ థియేటర్ల మరమ్మతుల కోసం నేను వెచ్చించిన మొత్తాన్ని తిరిగి ఇస్తే నాకు న్యాయం చేసినట్లవుతుంది. ఈ విషయంలో సదరు బడా నిర్మాతలు నాపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందుకే నేను న్యాయ పోరాటం చేద్దామనుకుంటున్నాను. నేను ఒక సెక్టార్ ఛైర్మన్‌ ని. అయినా తగిన గౌరవం దక్కడం లేదు. అంతవరకు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను" అన్నారు.

    English summary
    Small producer Natti Kumar has launched his second phase of fight against the four big producers of the Tollywood on yesterday. He got irritated with them for they have asked the State Government to increase the ticket rates of cinema halls. Natti Kumar putting his guns on the shoulders of his mentor Dasari Narayanarao targets the four big producers Allu Aravind, Dil Raju, D.Sureshbabu and Aswini Dutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X