twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెన్ను పోటు పర్వం రిపీట్, బాబు బ్రహ్మీ అయిపోయాడు... వర్మ సెటైర్లు

    |

    Recommended Video

    RGV Funny Satires On Opposition Leader Chandrababu Naidu || Filmibeat Telugu

    తెలుగు దేశం పార్టీ ఏపీలో ఓటమి పాలవ్వడం, చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కుర్చీ దూరం కావడంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ దగ్గర నుంచి ఆయన ట్విట్టర్ ద్వారా చంద్రబాబు గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉన్నాయి.

    తాజాగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారని, చంద్రబాబు కమెడియన్ బ్రహ్మానందంలా మారిపోయారు కాబట్టే ఆయన అలా నవ్వుతున్నారు అంటూ ట్వీట్ చేశారు.

     CBN has become brahmanandam in the assembly: RGV

    వెన్నుపోటు పర్వ రిపీట్ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినపుడు నాదేండ్ల భాస్కర్ రావు వెన్నపోటు పొడిచారు. అలాగే చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లినపుడు టీడీపీ నేతలు ఆయన్ను వెన్నుపోటు పొడిచారు అంటూ... మరో ట్వీట్ చేశారు.

    రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం విడుదల ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ చిత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే ఆ పార్టీ శ్రేణులు కావాలనే అడ్డంకులు సృష్టించాయనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్మ తన సినిమాను సాఫీగా రిలీజ్ చేసుకోగలిగాడు.

    వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతి, విజయవాడలో కడప జిల్లాకు చెందిన రెడ్లు ఎక్కువగా కనిపిస్తుండటంతో... త్వరలో తాను 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీయబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ త్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికన్ని రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు

    English summary
    "I am so loving to see ysjagan laughing so uncontrollably whenever ncbn speaks which basically means CBN has become brahmanandam in the assembly. History keeps on repeating itself ...The way Nadendla Bhasker Rao back stabbed NTR when he was abroad now the TDP leaders have backstabbed CBN when he is abroad." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X