సి.సి.రెడ్డి కొత్త సినిమా 'టీ..సమోస..బిస్కట్'?
{image-cc reddy_23062008.jpg telugu.filmibeat.com}'గౌతమ్ ఎస్.ఎస్.సి' ,'రూమ్ మేట్స్' వంటి సినిమాలు తీసినా రాని పేరు సి.సి.రెడ్డిగారికి ఒక్కసారిగా శ్రేయాభిలాషి సినిమాతో వచ్చేసింది. ఆత్మహత్యలు చేసుకునేముందు ఒక్క క్షణం ఆలోచిస్తే అన్నీ చక్కబడతాయనే సందేశంతో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఆయన అదే ఉషారులో 'టీ..సమోస...బిస్కట్' అనే మరో ఆలోచనాత్మక చిత్రానికి శ్రీకారం చుటుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయోభిలాషి చిత్రానికి మాటలు రాసి పేరుతెచ్చుకున్న రమేష్ చెప్పాల దీనికీ రచన అందిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇరానీ కాఫీ హోటలు చుట్టూ తిరిగే కథగా అనుకుంటున్న ఈ చిత్రం కామిడీగా హిలేరియస్ గా నడుస్తుందని అంతర్లీనంగా సమకాలీన సమస్యలు చర్చిస్తారని తెలుస్తోంది.
దీనికి నల్లపూసలు దర్శకుడు బాబ్జి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దర్శకుడుగానే కాక బాబ్జి పాటల రచయితగా (పాట నా సంతకం)పాపులర్ . భావుకుడైన ఆయన దర్శకత్వం వహించే ఈ సినిమా విసు బ్యానర్ లో రావటం ,అభ్యుదయ భావాలు గల రచయితగా పేరు తెచ్చుకున్న రమేష్ పనిచేయటం క్రేజ్ తెస్తోంది. తారాగణం ఇంకా ఫైనలైజ్ కాని ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అంటే మరో ఐదారు నెలల్లో మరో మంచి సినిమాని మనం టేస్టే చేయచ్చన్నమాట. బెస్టాఫ్ లక్ ...బాబ్జి...


Click it and Unblock the Notifications











