సిసిఎల్-3... ఏ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: దేశంలోని వివిధ సినీరంగాలకు చెందిన స్టార్స్ అంతా కలిసి ఆడుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సిసిఎల్) గత రెండు సీజన్లు మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సారి సిసిఎల్-3 టోర్నీ కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ తరుపున వెంకటేష్ కెప్టెన్సీలో 'తెలుగు వారియర్స్' జట్టు బరిలోకి దిగుతుండగా వివిధ సినీ రంగాల ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్టైకర్స్, బెంగాల్ టైగర్స్, వీర్ మరాఠి, భోజ్ పురి దబాంగ్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.
టాలీవుడ్ వారియర్స్ జట్టు సభ్యుల పేర్లు వారు ధరించే జెర్సీ నెంబర్లతో సహా...
వెంకటేష్ (1), శ్రీకాంత్ (5), తరుణ్ (7), రామ్ చరణ్ తేజ్(33), నితిన్(23), రఘు(32), అజయ్(26), రాజీవ్ కనకాల(13), నిఖిల్(27), కార్తీక్(3), సామ్రాట్ (10), ఆదర్శ్(69), ప్రిన్స్(36), నందకిషోర్ (6), విశ్వ(45), హర్ష(99), సన్నీ(8), తేజ(666), గిరి (28),ఆదిత్య (34).
ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. మార్చి 10న బెంగుళూరులో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. తాజాగా ఆ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ రిలీజైంది. ఏయే జట్లు ఎప్పుడు, ఎక్కడ తలపడుతున్నాయి. లైవ్ మ్యాచ్ ఏ టీవీ ఛానల్లో ప్రసారం అవుతుందనే పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో వీక్షించండి.

తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు.

సిసిఎల్-3 మ్యాచ్ షెడ్యూల్.

సిసిఎల్-3 మ్యాచ్ షెడ్యూల్.

టీమ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రామ్ చరణ్ 33 నెంబర్ జెర్సీతో..

ముంబై హీరోస్.

భోజ్ పురి దబాంగ్స్.

కర్నాటక బుల్డోజర్స్.

బెంగాల్ టైగర్స్.

వీర్ మరాఠి టీం.


Click it and Unblock the Notifications











