హాట్ టాపిక్ :అపూర్వ లఖియా... పరుగుల తుఫాన్‌

By Srikanya

దుబాయ్ :అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన 'తుఫాన్‌' చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ... ఆయన సృష్టించిన పరుగుల తుఫాన్‌ మాత్రం సూపర్‌హిట్టయింది. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌-4)లో భాగంగా శనివారం దుబాయ్‌లో ముంబై హీరోస్‌, తెలుగు వారియర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సాగింది. ముంబై జట్టు 37 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టాడు అపూర్వ లఖియా. జట్టు 50 పరుగులు కూడా చేస్తుందో లేదో అనుకొంటున్న దశలో మైదానంలో పరుగుల తుఫాన్‌ సృష్టించాడు.

CCL 4: Apoorva Lakhia's 69 steers Mumbai to 128

కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆయన ఆట మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అపూర్వకి ఇంద్రనీల్‌ చక్కటి సహకారం అందించారు. ఆయన 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ముంబయి జట్టు 127 పరుగుల స్కోరు సాధించింది. అపూర్వ ఆటలో మూడు బౌండరీలతో పాటు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి విజయం అందుకొంది తెలుగు జట్టు. ప్రిన్స్‌, సుధీర్‌బాబు, సచిన్‌ జోషి, అఖిల్‌, ఆదర్శ్‌ తదితర తారలు బ్యాట్‌తో మెరుపులు మెరిపించారు. రఘు, నందకిషోర్‌ బాల్‌తో మేజిక్‌ చేశారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఇంకా రెండు ఓవర్లు మిగిలివుండగానే తెలుగు వారియర్స్‌ జట్టు విజయ పతాకం ఎగరేసింది. ఈసారి కప్పు గెలవడమే తమ లక్ష్యమని చాటి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X