సిసిఎల్-5‌కు సిద్ధమౌతున్న సినీ స్టార్స్, వివరాలు..

By Bojja Kumar

హైదరాబాద్: 2011లో ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు మంచి స్పందన రావడంతో ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ సినిమా తారల క్రికెట్ లీగ్. మరికొన్ని రోజుల్లో ‘సిసిఎల్-5' మొదలు కాబోతోంది.

https://www.facebook.com/TeluguFilmibeat

తెలుగు చిత్ర పరిశ్రమ, తమిళ చిత్ర పరిశ్రమ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమ, మళయాల చిత్ర సీమ, కన్నడ చిత్ర సీమ, మరాఠీ చిత్ర పరిశ్రమ ఇలా దేశంలోని వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్స్ అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే కార్యక్రమం కావడంతో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

CCL 5 practice going on in full swing

సిసిఎల్ 5 సీజన్ చాంపియన్ షిప్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా ఇప్పటికే స్టార్స్ అంతా కలిసి చెమట చిందిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ లో భాగంగా తెలుగు వారియర్స్ - ముంబై ముంబై వాంఖేడే మధ్య ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జరిగింది.

తెలుగు వారియర్స్ టీంకి విక్టరీ వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హైదరబాద్ ప్రాక్టీస్ సెషన్స్ ని చాముండేశ్వరినాథ్ - ప్రతాప్ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలుగు వారియర్స్ టీంలో అఖిల్, నిఖిల్, సుశాంత్, సాయి ధరమ్ తేజ్, సుదీర్ బాబు, ప్రిన్స్, ఆదర్శ్ తదితరులు ఆడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X