సీసీఎల్ కోసం అన్ని వుడ్‌ల హీరోయిన్లు ఆరబోశారు
పిటపిటలాడే మోడల్స్ తో ప్రతి సంవత్సరం కింగ్స్ ఫిషర్ క్యాలెండర్ విడుదలవుతుందనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ క్యాలెండర్ గురించి ఎవరూ పెద్గగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దాకింటే హాట్ గా సీసీఎల్-2012 క్యాలెండర్ వచ్చింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను పురస్కరించుకుని నిర్వాహకులు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని వుడ్ల హీరోయిన్లతో అందాలు ఆరబోయించి క్యాలెండర్ తయారు చేశారు. అందుకు సంబంధించి ఫోటోషూట్ వీడియోను కూడా వదిలారు.
జనవరి నుంచి జరిగే సిసిఎల్-2 ప్రమోషన్లో భాగంగానే ఈ అందాల ఆరబోతకు శ్రీకారం చుట్టారు తారంలంతా. కాజల్, జెనీలియా, శ్రియ, ప్రియమణి, దీక్షా సేథ్ చార్మి, సోనాక్షి సిన్హా, సమీరరెడ్డి లాంటి హాట్ బ్యూటీలతో పాటు చాలా మంది హీరోయిన్లు ఏమాత్రం సిగ్గు పడకుండా ఫోటో షూట్లలో పాల్గొన్నారు. ఐడియాతో సిసిఎల్ టోర్నీపై అందరిలో ఆసక్తి నెలకొంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు చెందిన తారలు ఒకే వేదికపైకి వచ్చి సందడి చేశారు. ఈ కార్య్రకమంలో వెంకటేష్ మాట్లాడుతూ ఈ సారి కప్పు తప్పకుండా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











