సిసిఎల్ 2 : అందాలతో పాటు ఆట చూస్తూ మజా...

By Bojja Kumar

అందమైనా తారలను చూస్తూ....ఇష్టమైన క్రికెట్ చూస్తుంటే ఆ మజాయే వేరు. ఈ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. గత సంవత్సరం నిర్వహించిన సిసిఎల్ టోర్న మెంట్ సూపర్ హిట్ కావడంతో ఆటకు మరింత గ్లామర్ జోడించి మరో రెండు జట్లను అదనంగా చేర్చి సిసిఎల్-2ను నిర్వహిస్తున్నారు. దేశంలోని సినీ పరిశ్రమలన్నింటి మధ్య సమన్వయం పెంచడంతో పాటు, భారత దేశ రంగుల ప్రపంచంలోని తారలందరినీ ఓకే వేదికపై చూపించడం, సినీ అభిమానులకు వినోదం పంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. గతంలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల సినీ జట్లు ఉండగా...ఈ సారి సిసిఎల్2లో మళయాళి, బెంగాళీ జట్లు కూడా చేరాయి. ఈ రోజు నుంచి షార్జా స్టేడియంలో పోటీలు మొదలు కానున్నాయి. తొలి మ్యాచ్ తెలుగు వారియర్స్-ముంబై హీరోస్ జట్ల మధ్య జరుగబోతోంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరుగుతుంది. ప్రారంభ వేడుకల్లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మస్తీ కార్యక్రమంతో అలరించనున్నాడు.

మ్యాచ్ షెడ్యూల్ కింది విధంగా ఉంది

జనవరి 13, ముంబై హీరోస్ vs తెలుగు వారియర్స్(దుబాయ్)
జనవరి 14, ముంబై హీరోస్ vs చెన్నయ్ రైనాస్(దుబాయ్)
జనవరి 15, బెంగాల్ టైగర్స్ vs కర్నాటక బెల్డోజర్స్(బెంగుళూరు)
జనవరి 21, కేరళ స్ర్టైకర్స్ vs చెన్నయ్ రైనాస్(హైదరాబాద్)
జనవరి 21, తెలుగు వారియర్స్ vs కర్నాటక బుల్డోజర్స్(హైదరాబాద్)
జనవరి 22, బెంగాల్ టైగర్స్ vs చెన్నయ్ రైనాస్(కొచ్చి)
జనవరి 22, కేరళ స్ట్రైకర్ష vs ముంబై హీరోస్(కొచ్చి)
జనవరి 28, తెలుగు వారియర్స్ vs కేరళ స్ట్రైకర్స్(చెన్నయ్)
జనవరి 28, కర్నాటక బుల్డోజర్స్ vsచెన్నయ్ రైనాస్(చెన్నయ్)
జనవరి 29, బెంగాల్ టైగర్స్ vs తెలుగు వారియర్స్(బెంగుళూరు)
జనవరి 29, కర్నాటక బుల్డోజర్స్ vs ముంబై హీరోస్(బెంగుళూరు)
ఫిబ్రవరి 4, కేరళ స్టైకర్స్ vs బెంగాల్ టైగర్స్(హైదరాబాద్)
ఫిబ్రవరి 4, తెలుగు వారియర్స్ vs చెన్నయ్ రైనాస్(హైదరాబాద్)
ఫిబ్రవరి 5, కర్నాటక బుల్డోజర్స్ vs కేరళ స్టైకర్స్(కోల్ కతా)
ఫిబ్రవరి 5, బెంగాల్ టైగర్స్ vs ముంబై హీరోస్(కోల్ కతా)
ఫిబ్రవరి 11, సెమీఫైనల్స్ 1, సెమీఫైనల్స్ 2(చెన్నయ్)
ఫిబ్రవరి 12, ఫైనల్ (హైదరాబాద్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X