రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)
పుణె: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL)లో భాగంగా ఆదివారం పుణెలో జరిగిన మ్యాచ్‌లో భోజ్‌పూర్ దబాంగ్స్‌పై తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు సమష్టిగా రాణించింది. తెలుగు హీరోలు తమదైన శైలిలో అదరకొట్టి విజయం సాధించారు. వెండితెరమీదే కాదు క్రికెట్ పిచ్ మీదా తాము హీరోలమని నిరూపించుకున్నారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ హీరోలు చెలరేగి ఆడిుతున్నారు. విక్టరీ వెంకటేష్ నేతృత్వంలో తెలుగు వారియర్స్ టీం వరుసగా మూడో విజయం దక్కించుకుంది. ఇప్పటికే బెంగాల్ టైగర్స్ పై విజయం సాధించిన తెలుగు వారియర్స్ టీం, ముంబై హీరోస్‌తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం 7 వికెట్ల తేడాతో ముంబై హీరోస్‌పై ఘన విజయం సాధించింది. ఇప్పుడు భోజ్‌పూర్ దబాంగ్స్‌పై తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ జట్టుకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఆయన ఆడుతున్నంతసేపూ హర్షద్వానాలు మెన్నంటుతూనే ఉన్నాయి. జట్టుకి ఉత్సాహమిస్తూ వెంకీ ముందుకు నడిపించగా, మిగతా టీమ్..ఎలాగైనా గెలుపు సాధించాలనే ఓ రేంజిలో ఆడి..విజయం సాధించారు.
ఆ ఫోటోలు మీ కోసం...

99 పరుగుల తేడాతో దబాంగ్స్‌ను చిత్తు చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

తేజ(74), ఆదిత్య(65 నాటౌట్) భోజ్‌పూర్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దబాంగ్స్ 89 పరుగులకే చేతులెత్తేసింది.

రఘు అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టి తెలుగు వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో తెలుగు వారియర్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.

టీమ్ కు ఉత్సాహానిస్తూ ఛార్మింగ్ ఛార్మి...

మేమంతా మీ వెనకే... అదరకొట్టండి...

యంగ్ హీరో నిఖిల్ .. ఆటలో విజయానికి తన వంతుగా...

గెలిచేద్దాం..ప్రామిస్..

అబ్బ...అందరికీ నవ్వులే...

మీరు చెప్తున్నట్లే ఆడుతున్నా మరి.. మన కాంబినేషన్ కూడా చూడండి...

మిగతా వాళ్లు ఆడేటప్పుడు ఇలా సీరియస్ లుక్ తో...వెయిటింగ్

మేం బ్యాట్స్ పడితే మీరు అవుట్...

మనకే గెలుపు..యాహూ...


Click it and Unblock the Notifications











