twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కె.బాలచందర్‌ మృతి: తెలుగు హీరోలు, దర్శకుల స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు కె.బాలచందర్‌ మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేబీ మంగళవారం రాత్రి 7.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయనను ఈనెల 15న చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్చారు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వెంటనే ఆస్పత్రికి వచ్చి ఆయనను చూసి వెళ్లారు. పరిశ్రమకు చెందిన పలువురు హేమాహేమీలు కూడా వచ్చి ఆయన్ను పరామర్శించారు. బాలచందర్‌ ఆరోగ్యం కొంత కుదుటపడిందని ఆస్పత్రివర్గాలు రెండురోజుల క్రితం ప్రకటించాయి. నెమ్మదిగా కోలుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి అంతిమశ్వాస విడిచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    1930 జూలై 9న జన్మించిన బాలచందర్‌ పూర్తిపేరు కైలాసం బాలచందర్‌. ప్రఖ్యాత నటులు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌లను తెరపై కి పరిచయం చేసిన ముకుటం లేని వ్యక్తి బాలచందర్‌. ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలచందర్‌ మృతికి తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు దిగ్ర్బాంతి చెందాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. తెలుగులో ఆయన తొలిచిత్రం భలే కోడలు, అంతులేనికథ చిత్రంతో రజనీకాంత్‌ను..మరోచరిత్ర సినిమాతో కమల్‌హాసన్‌ను ఉన్నత స్ధానానికి తీసుకెళ్లిన మహానుబావుడు బాలచందర్‌.

    బాలచందర్‌ కన్నుమూతతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది. ముఖ్యంగా తమిళ పరిశ్రమ కన్నీటిపర్యంతమైంది. తెలుగు పరిశ్రమనుంచీ ఆయనకు చాలా మంది నటులు, దర్శకులు, నిర్మాతలు నివాళులు అర్పించారు.

    వారి స్పందన స్లైడ్ షోలో..

    ఎస్పీ బాలసుబ్రమణ్యం

    ఎస్పీ బాలసుబ్రమణ్యం

    ''బాలచందర్‌ చిత్రాల్లో హీరో పేర్లు 99 శాతం బాలు అనే పేరుతోనే ఉంటాయి. తమిళంలో మొదటిసారి నన్ను నటుడిగా పరిచయం చేసేటప్పుడు చిత్రీకరణకు కొద్దిరోజుల ముందే మా నాన్నగారు మరణించారు. అయినా షూటింగ్‌ ప్రారంభిద్దామని నేనంటే... ఆయన మాత్రం నెలరోజుల తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టారు.' అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

    రజనీకాంత్‌

    రజనీకాంత్‌

    ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ లేని లోటు తనకు వ్యక్తిగతంగా వృత్తిగతంగానూ పూడ్చలేనిదని రజనీకాంత్‌ అన్నారు. తనను సొంత బిడ్డలా చూసుకున్నారని చెప్పారు.

    చిరంజీవి

    చిరంజీవి

    బాలచందర్‌తో తనకెంతో అనుబంధముందని మెగాస్టార్‌, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. ''నేను సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో బాలచందర్‌ దర్శకత్వంలో 'ఇది కథ కాదు'లో నటించే అపురూప అవకాశం లభించింది. అలాగే ఆయన దర్శకత్వంలో 'రుద్రవీణ'లో నటించడం గర్వకారణం. దానికి జాతీయ సమైక్యతాఅవార్డు అభించింది'' అన్నారు.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    "లెజండరీ దర్శకుడు బాలచందర్ గారికి నా శ్రధ్దాంజలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా ".

    రామ్ గోపాల్ వర్మ

    రామ్ గోపాల్ వర్మ

    " కె.బాలచందర్ లాంటి గొప్ప దర్శకులు వెళ్లిపోవటం విషాదకరం...ఆల్ టైమ్ పాత్ బ్రేకింగ్ డైరక్టర్ ఆయన". అన్నారు

    ప్రకాష్ రాజ్

    ప్రకాష్ రాజ్

    "బాలచందర్ సార్...మీరు నా జీవితాన్ని మార్చినందుకు ధాంక్యూ...నేను మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.. నాకు బాధతో ఏడుపుస్తోంది..మేము మిమ్మల్ని చాలా మిస్సయ్యాం...లవ్ యూ సార్ " అన్నారు.

    రామ్

    రామ్

    "బాలచందర్ గారు తీసిన మాస్టర్ పీస్ చిత్రాలతో ఆయన చిరకాలం మనతోనే ఉంటారు...యు విల్ బి మిస్సెడ్ సార్...". అన్నారు.

    నాని

    నాని

    " బాలచందర్ గారు ఇక లేరు..ఓ యుగం ముగిసింది.. బాపు గారు, బాలచందర్ గారు ఒకే సంవత్సరంలో మరణించారు... మాకు చాలా బాధగా ఉంది". అన్నారు.

    హరీష్ శంకర్

    హరీష్ శంకర్

    "RIP....కె.బాలచందర్ సార్ ..ఓ నిజమైన లెజండ్".

    అమలా పాల్

    అమలా పాల్

    " చిత్ర పరిశ్రమ ఓ లెజండ్ ని కోల్పోయింది. ఫిల్మ్ మేకర్స్ కు కు బాలచందర్ గారు ఎప్పుడూ నిజమైన ప్రేరణ ఇస్తూంటారని నాకు తెలుసు.. మీ ఆత్మకు శాంతికి కలగలాలని కోరుకుంటున్నాను."

     లక్ష్మీ రాయ్

    లక్ష్మీ రాయ్

    "మన పరిశ్రమ మరో లెంజడరీ దర్శకుడుని కోల్పోయింది..వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వమని కోరుకుంటున్నా".

    మంచు మనోజ్

    మంచు మనోజ్

    జీనియస్ కి నా నివాళి

    దాసరి నారాయణ రావు

    దాసరి నారాయణ రావు

    ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక పెద్ద హీరోకు ఉండేంత క్రేజున్న దర్శకుడు బాలచందర్ గారు. ఆయన్ను చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలంటే...దర్శకుడు అనేవాడు ఎప్పుడూ ఏ హీరో మోకాళ్ల దగ్గరా ఉండకూడదని. మొదటి నుంచి చివరి దాకా అలాగే సింహంలా బ్రతికారు. ఆయన లేరన్న నిజాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

    తణికెళ్ల భరణి

    తణికెళ్ల భరణి

    బాలచందర్‌ లేరంటే... ఓ పెంకుటిల్లు కూలిపోయినట్టు అనిపించింది. మధ్యతరగతి జీవితం బేల మొహం వేసుకొని చూస్తున్నట్టే అనిపించింది.

    మారుతి

    మారుతి


    కె.బాలచందర్ గారు సినిమా వున్నంతకాలం ఎప్పటికీ బ్రతికే ఉంటారు. దర్శకుడు పేరుతో సినిమాకు ప్రేక్షకులు రావటం ఆయన మొదలెట్టిందే. శారీరకంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

    అల్లు అఱ్జున్

    అల్లు అఱ్జున్

    బాలచందర్ మృతి యావత్ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. భారతదేశం గర్వించతగ్గ దర్శకుల్లో మొట్ట మొదటి వరసలో నిలిచే దర్శకుడు కె.బాలచందర్. చిరంజీవి గారితో రుద్రవీణ లాంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించి అందరి హృదయాల్లో చిరస్దాయిగా నిలచిపోయాలా చేసిన దర్శక పితామహుడు కె. బాలచందర్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

    రాజమౌళి

    రాజమౌళి


    భారతీయ సినిమా లెజండరీ దర్శకుడు కె. బాలచందర్ మరణ వార్త వినగానే చాలా షాకింగ్ గా అనిపించింది. ఆయన ఇక లేరు. ఓ యుగం ముగిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

    పూరి జగన్నాథ్

    పూరి జగన్నాథ్

    లెజండరీ దర్శకుడు కె.బాలచందర్ మరణించారు. భారతీయ సినిమా ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింద. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా సార్.

    లక్ష్మీ మంచు

    లక్ష్మీ మంచు

    కె బాలచందర్ గారూ మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నాను. మీరు సినిమాని పునర్ నిర్విచించారు. సినిమా పరిశ్రమకు వచ్చిన ఈ నష్టం పూడ్చలేనిది.

    ప్రియమణి

    ప్రియమణి


    ఆయనను చూసే అవకాసం చాలా సార్లు వచ్చింది... బాలచందర్ గారూ మిమ్మల్ని మేము మిస్సయ్యాం...మీ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాం.

    సందీప్ కిషన్

    సందీప్ కిషన్


    2014 త్వరగా ముగిసిపో...చాలా విషాదాలని మాకు మిగిలుస్తున్నావ్. బాలచందర్ గారూ మేము మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

    శ్రియా రెడ్డి

    శ్రియా రెడ్డి

    ఎంత గొప్ప లెజండ్ ఆయన. బాలంచందర్ గారూ మీ ఆత్మకు శాంతి కలగాలని కలుగుగాక.

    బి.వియస్ రవి

    బి.వియస్ రవి

    బాలచందర్ గారి చిత్రాలు ...స్త్రీల హృదయ భాషను వ్యక్త పరుస్తూంటాయి. ఆయన సమాజాన్ని ప్రశ్ని్ంచారు.సమాధానపరిచారు...మమ్మల్ని ఛాలెంజ్ చేసారు..మమ్మల్ని మార్చారు.
    వెన్నెల కిషోర్

    వెన్నెల కిషోర్

    RIP కె.బాలంచందర్ సార్. భారతీయ సినిమాలలో ఒక ప్రముఖ దర్శకులు మీరు. కమల్ రజనీ వంటి ఎంతో మంది నటులను అందించిన శిఖరం మీరు.

    వన్ ఇండియా తెలుగు

    వన్ ఇండియా తెలుగు


    ఈ దర్శక శిఖరానికి వన్ ఇండియా తెలుగు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తోంది.

    English summary
    Entire South Film Fraternity mourned the death of Legendary Director of K Balachander. Here are some of the celeb tweets...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X