వాలంటైన్స్ డే వద్దంటూ వర్మ మన్మధ బాణం
అందరూ వెళ్లే దారిలో వెలితే అందులో వింతే ముంది? అందరూ మాట్లాడినట్లే మాట్లాడితే అందులో వెరైటీ ఏముంది? ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే వర్మ దారిలో నడవాల్సిందే. ప్రతి విషయంలోనూ ఇతరులకంటే భిన్నంగా స్పందించే రామ్ గోపాల్ వర్మ 'వాలంటైన్స్ డే' విషయంలోనూ తనదైన రీతిలో స్పందించారు.
అసలు భారతీయులు వాలంటైన్స్ డే ఎందుకు జరుపుకోవాలి? మనకు మన్మధుడు ఉన్నాడు కదా. వాలంటైన్స్ డే కాదు, మన్మధ రోజుని సెలబ్రేట్ చేసుకుకోండి అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వెస్టర్న్ రొమాన్స్ పై ఉన్న మోజు....భారతీయ రొమాన్స్ పై ఎందుకు లేదని ప్రశ్నించారు. భారతీయులు భారత్‌ను ఇష్ట పడతారుకానీ...తోటి భారతీయులను ఇష్టపడరంటూ వ్యాఖ్యానించారు.
నిన్న ఫోర్న్ ను భారత్‌లో చట్టబద్దం చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా.....వాలంటైన్స్ డే సందర్భంగా మన్మధుడిని గుర్తు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











