ఎన్టీఆర్ 'బాద్‌షా' టీమ్ సెలబ్రేషన్స్ (ఫోటో)
హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్‌షా'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఓ రేంజి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో శనివారం చిత్రం యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకకు పూరీ జగన్నాధ్ సైతం హాజరయ్యారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ... ''దూకుడు తరవాత చేస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు బాగా పెరిగాయి. దాంతో నాపై ఒత్తిడి ఎక్కువైంది. 'బాద్‌షా' కోసం పడిన ఏడాది కష్టాన్ని మర్చిపోయేలా చేసింది... ప్రేక్షకుల స్పందన. నేను నమ్ముకున్న వినోదమే నాకు వరుస విజయాల్ని అందిస్తుంది. స్పందన తెలుసుకొని ఎన్టీఆర్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.'' అన్నారు.
అలాగే ''ఎవరు ఎన్ని చెప్పినా కథానాయకుణ్ని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకోవాలి. అప్పుడే కథకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. 'దూకుడు' కథని మహేష్‌బాబుని దృష్టిలో పెట్టుకుని రాస్తే, 'బాద్‌షా' ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన కథ అని చెప్పారు.
ఇక ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. నా నుంచి ప్రేక్షకులు ఆశించేది వినోదం. 'దూకుడు' దర్శకుడిగా నాకున్న శైలిని బలపరిచింది. అందువల్లే 'బాద్‌షా'లో దూకుడు పోలికలు ఉన్నట్టు కనిపించొచ్చు. ఎన్టీఆర్ శైలి సంభాషణలు, డాన్స్‌లతో పాటు ప్రథమార్థంలో బంతి జానకి, ద్వితీయార్థంలో బ్రహ్మానందం పండించే వినోదం ప్రేక్షకులకు నచ్చాయి.'' అని హిట్ కి కారణం వివరించారు.
''నేను ఓ సినిమా చేసేటప్పుడు చాలా లెక్కలు వేసుకుంటాను. కథకు ఎంత బడ్జెట్ అవసరం. ఎంత వ్యాపారం అవుతుంది? ఇలాంటి లెక్కలు వేసుకున్నాకా సినిమా మొదలుపెడతాను. మనల్ని నమ్మి నిర్మాత సినిమా తీస్తున్నప్పుడు మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలనేది నా విధానం'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











