సమంత, చైతూ చంపేశారు.. మజిలీ గురించి మంచు లక్ష్మి, నాగ్, ఇతర సెలబ్రిటీల రివ్యూ

నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకులు, సినీ విమర్శకులు ప్రశంసలందుకొన్న దర్శకుడు శివ నిర్వాణ తాజాగా రూపొందించిన చిత్రం మజిలి. నాగచైతన్య, సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్ ప్రధాన తారలు. సెన్సిటివ్, ఎమోషనల్‌ స్టోరీగా చెప్పుకొంటున్న మజిలి చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి మంచు లక్ష్మీ, మనోజ్, దర్శకుడు హరీష్ శంకర్, బాబీ, హీరో సుశాంత్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేమిటంటే..

అందమైన భావోద్వేగం

అందమైన భావోద్వేగమే మజిలీ సినిమా. అందమైన దంపతులు నాగచైతన్య, సమంత అక్కినేనికి కంగ్రాట్స్. మంచి అనుభూతికి లోనయ్యే సినిమాను అందించిన మీ ఇద్దరికి, చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేసి అభినందించారు.

హృదయానికి హత్తుకునేలా, నిజాయితీతో

గత కొద్దికాలంగా తెలుగులో హృదయానికి హత్తుకునేలా, నిజాయితీతో కూడిన ప్రేమకథలు రాలేదన్న ఫీలింగ్‌తో ఉన్న నేను మజిలీ చూశాను. అద్భుతంగా ఉంది ఈ సినిమా. సమంత, చైతన్య అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో చంపేశారు. సినిమాలో ప్రతీ ఒక్కరు బాగా నటించారు. శివ నిర్వాణ హ్యాట్సాఫ్. మీ మీద మరింత గౌరవం పెరిగింది. సినిమాను ఈ రోజే చూడండి అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

సమంత, నాగచైతన్య అద్భుతంగా

మజిలీ హృదయ నాళాలను మీటింది. ఈ సినిమాలో సమంత, నాగచైతన్య అద్భుతంగా నటించారు. టాలీవుడ్‌లో అగ్రశ్రేణి డైరెక్టర్లలో చేరడం ఖాయం. ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చారు. థమన్ మ్యూజిక్ సూపర్. మజిలీ చిత్ర యూనిట్‌కు కంగ్రాట్యులేషన్ అని దర్శకుడు బాబీ అన్నారు.

నాగచైతన్య దంపతులకు కంగ్రాట్స్

నాగచైతన్య దంపతులకు కంగ్రాట్స్

మజిలీని అద్భుతమైన సినిమాగా మలిచిన నాగచైతన్య, సమంత దంపతులకు శుభాకాంక్షలు. దర్శకుడు శివ నిర్వాణ అంకితభావం, పట్టుదల బాగుంది. థమన్ రీరికార్డింగ్ ఎమోషన్స్‌ను బాగా పండించింది. మజిలీ ఈ రోజు రిలీజైంది. తప్పక చూడండి అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. యాక్టర్ సుబ్బరాజు, రావు రమేష్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. చాయ్ బిస్కెట్ సుహాస్ కామెడీ టైమింగ్ బాగుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

చక్కగా హ్యాండిల్ చేశారని

చైతూ, సమంత క్యారెక్టర్లలోనే రిలీజ్‌కు ఓ రోజు ముందే హీరో సుశాంత్ ట్వీట్లతో హడావిడి చేశారు. మజిలీ అందమైన ప్రేమకథ.. దర్శకుడు శివ నిర్వాణ చక్కగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమా కథలో ప్రేమ, బాధ, భావోద్వేగాలు రెండు కలిసి ఉన్నాయి. ఈ సినిమాలో చైతూ, సామ్‌ కనిపించలేదు. కేవలం వాళ్లు క్యారెక్టర్లుగానే కనిపించారు. చైతూ, సమంత అద్భుతమైన నటనను ప్రదర్శించారు. దివ్వాంశ తొలి సినిమాతోనే ఆకట్టుకొన్నారు.

బ్రిల్లియెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో

చైతన్య, సమంత బ్రిల్లియంట్ చైతన్య, సమంత పెర్ఫార్మెన్స్ బ్రిల్లియంట్. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. రావు రమేష్, పోసాని యాక్టింగ్ అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్ మజిలీ టీమ్ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X