»   » పవన్ కళ్యాణ్‌పై...సినీ సెలబ్రిటీల కామెంట్స్ ‌(ఫోటో ఫీచర్)

పవన్ కళ్యాణ్‌పై...సినీ సెలబ్రిటీల కామెంట్స్ ‌(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజుతో 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజును అభిమానులంతా పండగరోజులా జరుపుకుంటున్నారు. కొందరు రక్తదానం చేసి తమ అభిమానం చాటుకుంటే, మరికొందరు సేవాకార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ బహుషా ఇక ఏ హీరోకూ లేదేమో.

చేసినవి తక్కువ సినిమాలే అయినా, అందులో హిట్ సినిమాలు కొన్ని మాత్రమే అయినా....పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ మాత్రం ఇతింతై, వటుడింతై అన్నట్లు పెరిగిపోయింది. హిట్లు, ప్లాపులు అనే తేడా లేకుండా నిర్మాతలకు లాభాలు తెచ్చే హీరోగా పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్నాడు. భిన్నమై వ్యక్తిత్వం, మంచి గుణవంతుడు కావడం వల్లనే ఆయనకు అభిమానులు, ఫాలోయింగ్ భారీగా పెరిగిగింది అనేది పలువురి వాదన.

చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయనతో పని చేయడం అంటేనే ఎంతో గొప్ప ఫీలయ్యే స్టార్ దర్శకులు, నిర్మాతలు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఆయన స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరి వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి పలువురు సినీ సెబ్రిటీలు చేసిన కామెంట్స్ ఏమిటో ఓసారి చూద్దాం...

చిరంజీవి

చిరంజీవి

నేనేనాడూ వాడికి సూచనలు, సలహాలు ఇవ్వలేదు. మెచ్యూరిటీ, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కేరక్టర్ పరిధిని దాటి ఒక లేయర్ ఉంటుంది. అది ఇంటెలెక్టువల్స్‌కి మాత్రమే అర్థం అవుతుంది అని ఓ సారి వ్యాఖ్యానించారు పవన్ పెద్దన్నయ్య చిరంజీవి

అంజనా దేవి, పవన్ కళ్యాణ్ తల్లి

అంజనా దేవి, పవన్ కళ్యాణ్ తల్లి

సినిమాల్లో ఎలాగైతే నిజాయితీగా ఉంటాడో వాడు మామూలుగా కూడా అంతే నిజాయితీగా ఉంటాడు. అందరి కంటే ముందు నేను వాడి ఫ్యాన్‌ని....అంటూ కొడుకు గురించి చెబుతూ మురిసిపోయింది అంజనా దేవి.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.....మామూలుగా ఆయనంటే గౌరవం, నా గురించి కొన్ని విషయాలు ఆయన గుర్తు పెట్టుకున్నాడు అని తెలిసేసరికి ఆయన మీద గౌరవం ఇంకా పెరిగింది అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా', ‘గబ్బర్ సింగ్' చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించారు.

బండ్ల గణేష్

బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం, అలవాటు చేసుకుంటే వదల్లేం సచ్చేదాకా. ఆయన పెదాలు దాటి మాట రాదు, పెదాలు దాటి మాట వచ్చిందా... ప్రాణం పోయినా మాట చెల్లుతుంది....అని నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

కరుణాకరన్, తొలి ప్రేమ దర్శకుడు

కరుణాకరన్, తొలి ప్రేమ దర్శకుడు

పవన్ కళ్యాణ్‌తో ‘తొలి ప్రేమ' చిత్రం తీసి గుర్తింపు పొందిన దర్శకుల్లో కరుణాకరన్ ఒకరు. ఆయన మాట్లాడుతూ....పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ జీవితం లేదు నాకు. అమ్మా, నాన్న, అన్న అన్ని పవన్ కళ్యాణే అని భావిస్తాను అని వ్యాఖ్యానించారు.

కృతి కర్బందా

కృతి కర్బందా

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘తీన్ మార్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది కృతి కర్బందా. పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడుతూ అతనికి అతడే ఒక బ్రాండ్. ఆయనతో కలిసి పని చేసే అవకాశం దక్కడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

మంచు మనోజ్

మంచు మనోజ్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన మంచు మనోజ్ పవన్ కళ్యాన్ గురించి మాట్లాడుతూ..... పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే ఇష్టం. మహా ముక్కుసూటి మనిషి ఆయన. ఆయన సినిమా వస్తుందంటే ఏదో ఆసక్తి అని వ్యాఖ్యానించారు.

ఖషి మురళి

ఖషి మురళి

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి' చిత్రానికి పాటలు పడిన మురళి ఖుషి మురళిగా పాపులయ్యారు. దురదృష్ట వశాత్తు ఆయన ప్రస్తుతం మన మధ్యలో లేరు. ఆ మధ్య ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెలుతూ గుండె పోటుతో మరణించారు. ఆయన ఓసారి పవన్ గురించి మాట్లాడుతే.... పవన్ కళ్యాణ్ పేరు చెప్పి నేనెక్కడ పాట పాడినా ఆ రెస్పాన్స్ చాలా బాగుంటుంది అని వ్యాఖ్యానించారు.

నవదీప్

నవదీప్

పవన్ కళ్యాణ్ ఇన్స్‌స్పిరేషన్‌గా ఎంతో మంది యువ హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో నవదీప్ కూడా ఒకరు. ఓ సందర్భంలో నవదీప్ మాట్లాడుతూ..‘ఎంసెట్ ఎగ్జామ్ రేపు పెట్టుకుని ఈ రోజు జానీ సినిమాకు వెళ్లాను' అని వ్యాఖ్యానించారు.

ప్రణీత

ప్రణీత

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన హీరోయిన్ ప్రణీత మాట్లాడుతూ....పవన్ కళ్యాణ్ ఐంటే ఒక ఐకాన్. ఆయన వ్యక్తిత్వం, సింప్లిసిటీ ఎంతో నచ్చుతుంది అని ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసారు. నా జీవితంలో నేనెప్పుడూ ఓటు వెయ్యలేదు. పవన్ కళ్యాణ్ నిలబడితే నా ఓటు ఆయనకే అంటూ కామెంట్ చేసారు.

సమంత

సమంత

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న మరో లక్కీ హీరోయిన్ సమంత. ‘అత్తారింటికి దారేది' చిత్రంలో సమంత నటిస్తోంది. పవన్ గురించి ఆమె చెబుతూ..... పవన్ స్టార్ అనే టైటిల్ కంటే ఆయన చాలా మంచివారు అని తెలిపారు.

తమిళ హీరో విజయ్

తమిళ హీరో విజయ్

పవన్ కళ్యాణ్ క్రేజ్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఆయనకు మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బోలెడు మంది అభిమానులు ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని అని ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు తమిళ స్టార్ హీరో విజయ్.

విష్ణు వర్ధన్

విష్ణు వర్ధన్

పవన్ కళ్యాణ్‌తో ‘పంజా' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విష్ణు వర్ధన్ మాట్లాడుతూ...... రజినీని చూసాను, అజిత్‌ని చూసాము. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగును చూసి ఆశ్చర్య పోయాను అని వ్యాఖ్యానించాకు.

అలీ

అలీ

పవన్ కళ్యాణ్‌తో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో అలీ ఒకరు......ఆ మధ్య అలీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. నాతో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో నేను కలిసి చేస్తే కామెడీ బాగా పండుతుంది అని వ్యాఖ్యానించారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

యంగ్ హీరోల్లో ఒకరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.... ఆ మనిషి మన పక్కన ఉన్నా, లేక పోయినా ఆ పవర్ మాత్రం ఎక్కడా ఆగిపోదు. ఆయన ఫ్యాన్స్ రూపంలో ఎప్పుడూ వినపడుతుంటుంది అని వ్యాఖ్యానించారు.

ఆనంద సాయి

ఆనంద సాయి

తెలుగు సినిమా పరిశ్రమలోని గొప్ప టెక్నీషియన్లలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఒకరు. నేనీరోజు ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని ఓసారి ఆనందసాయి వెల్లడించారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ హెల్పింగ్ రేంజి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

రామ్ లక్ష్మణ్

రామ్ లక్ష్మణ్

టాలీవుడ్లో స్టార్ స్టంట్ మాస్టర్స్ అయిన రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ....ఆయన కేవలం బయటికి సినిమాల్లో కనిపించే హీరో మాత్రమే కాదు, ఆయన లోపల కూడా ఒక హీరో ఉన్నాడు. ఆయనొక అద్భుతమైన వ్యక్తి, జ్ఞాని అని వ్యాఖ్యానించారు.

సారా జాన్ డియాస్

సారా జాన్ డియాస్

ఆయన మహిళల పట్ల చూపే గౌరవం ఎంతో నచ్చుతుంది. ఔట్ డోర్ షూటింగులు జరిగిపుడు ఆయన నాతో పాటు ఇతర మహిళలకి ప్రొటెక్టివ్‌గా వ్యవహరించారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో భిన్నమైనది అని వ్యాఖ్యానించారు పంజా హీరోయిన్ సారా జాన్ డియాస్.

నీలిమ తిరుమల శెట్టి

నీలిమ తిరుమల శెట్టి

పవన్ కళ్యాణ్‍‌తో ‘పంజా' చిత్రాన్ని తెరకెక్కించిన నీలిమతిరుమలశెట్టి మాట్లాడుతూ.... నాకు ప్రోత్సాహం, కష్ట సమయాల్లో ముందుకు వెళ్లగలిగే ధైర్యం పవన్ కళ్యాణ్. సినిమా పరిశ్రమకి కొత్తగా ఏమైనా చెయ్యాలి. ఇలాంటివన్నీ కళ్యాణ్ గారి నుంచే తెలుసుకున్నాను. టాలెంటుని ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుంటాడు.

అంత్యాక్షరి టీం

అంత్యాక్షరి టీం

‘గబ్బర్ సింగ్' చిత్రంలో పవన్ కళ్యాణ్, అంత్యాక్షరి టీం మధ్య కామోడీ ఏ రేంజిలో పండిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా హిట్టయ్యాక ఈ టీంకు పవన్ కళ్యాణ్ విందు ఏర్పాటు చేసారు. పవన్ గురించి అంత్యాక్షరి టీం సభ్యులు మాట్లాడుతూ..‘ఆయనకు అంత స్టేటస్ ఉండి కూడా మమ్మల్ని వాళ్ల ఇంటికి పిలిచి భోజనానికి ప్లేట్స్ అందించాడు' అని వ్యాఖ్యానించారు.

భీమినేని శ్రీనివాసరావు

భీమినేని శ్రీనివాసరావు

తెలుగు సినిమా దర్శకుల్లో ఒకరైన భీమినేని శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్‌తో సుస్వాగతం, అన్నవరం చిత్రాలు తెరకెక్కించారు. పవన్ గురించి ఆయన మాట్లాడుతూ.... కమిట్‌మెంటు ఉన్న వ్యక్తి. ఒక ప్రామిస్ చేసాడంటే నిలబెట్టుకునే వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

. ధనరాజ్

. ధనరాజ్

ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతున్న కమెడియన్లలో ధనరాజ్ ఒకరు. పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానం గురించి ఆయన మాట్లాడుతూ..... రక్తం ఇచ్చేంత అభిమానం ఆయనంటే అని వ్యాఖ్యానించారు.

ఎస్.జె. సూర్య

ఎస్.జె. సూర్య

పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన ‘ఖుషి', ‘పులి' చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

హరీష్ శంకర్

హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి....ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న వ్యక్తి హరీష్ శంకర్. పవన్ గురించి హరీష్ మాట్లాడుతూ....ఆయనతో పని చేసిన తర్వాత రికార్డుల మీద వ్యామోహం పోతుంది, పని మీద ఆసక్తి పెరుగుతుంది అని వ్యాఖ్యానించారు.

ఇలియానా

ఇలియానా

పవన్ కళ్యాణ్‌తో ‘జల్సా' చిత్రంలో నటించిన ఇలియానా మాట్లాడుతూ ఆయన ఎంతో మంచి వ్యక్తి. నిజమైన జెంటిల్మెన్ అంటే ఆయనే. ఆయనంటే ఎంతో గౌరవం అని వ్యాఖ్యానించారు.

త్రివిక్రమ్

త్రివిక్రమ్

ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్‌కు అత్యంత సన్నిహితుల్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ‘భయం లేకుండా ఉంటే పవన్ కళ్యాన్‌ని నేను చాలా దగ్గర నుంచి చూసాను. అందుకే అతనంటే చాలా మంది భయపడతారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పగా ఉంటుంది' అని వ్యాఖ్యానించారు.

English summary
Power Star Pawan Kalyan, one of the leading actors of Telugu cinema, is celebrating his birthday today. Check out some of the comments by film celebrities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu