నా వల్ల కాదన్న శ్రీముఖి: ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్‌పై సెలబ్రిటీల కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. జనవరి 10 సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ ట్రైలర్ మీద తమ అభిప్రాయాలు వెల్లడించారు.
Recommended Video


దట్స్ ద బ్యూటీ
పవన్ కళ్యాణ్ సినిమా మీద ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్పందించారు. ట్రైలర్ చాలా బావుందని సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉందని తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ కి పండగలాంటి ట్రైలర్
ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలాంటి ట్రైలర్ అని, యూనివర్సల్ గా ఆకట్టుకునే అంశాలున్న ట్రైలర్ అని రచయిత గోపీ మోహన్ తెలిపారు.

దాని చర్యలు ఊహాతీతం
ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ఉంది, దాని చర్యలు ఊహాతీతం... దట్స్ ది బ్యూటీ అని నితిన్ ట్వీట్ చేశారు.

లాంగ్ వెయిట్
చాలా కాలంగా ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను చేసిన వెయిటింగుకు సంతృప్తి పడేలా ఉంది అని వెన్నెల కిషర్ ట్వీట్ చేశారు.

సాయి ధరమ్ తేజ్
తన మామయ్య మూవీ ట్రైలర్ చూసిన అనంతరం సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ... స్వాగతం కృష్ణా అంటూ ట్వీట్ చేశారు.

10న మెయిన్ వార్ బిగిన్
ఈ ట్రైలర్ మినీ వార్... జనవరి 10న మెయిన్ వార్ మొదలవుతుంది. వెయిటింగ్ ఫర్ ది బ్లాక్ బస్టర్ అంటూ మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.

విజయ్ కుమార్ కొండ చప్పట్లు
‘అజ్ఞాతవాసి' సినిమా ట్రైలర్ చూసిన అనంతరం దర్శకుడు విజయ్ కుమార్ కొండ చప్పట్లతో ట్విట్టర్‌ను మోత పుట్టించారు.

యాంకర్ శ్రీముఖి
ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు... అంటూ పవర్ స్టార్ జపంలో మునిగిపోయింది యాంకర్ శ్రీముఖి.


Click it and Unblock the Notifications











