twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి పీటలెక్కబోతోన్న రానా.. వెల్లువలా ప్రముఖుల విషెస్.. ఇదొక డ్రీమ్ అంటూ మెగా హీరో కామెంట్

    |

    టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్ తీస్తే అందులో రానా దగ్గుబాటి పేరు కచ్చితంగా ఉంటుంది. తెలుగు చిత్ర సీమలోని పెద్ద కుటుంబమైన దగ్గుబాటి వారసుడు రానా త్వరలోనే బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలకనున్నాడు. తన ప్రేయసి ఓకే చెప్పిందని పోస్ట్ చేశాడు. ఈ విధంగా తన వ్యక్తిగత విషయాన్ని ఇంత నిరాడంభరంగా చెప్పినా.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఇక తన ప్రేయసి ఫోటోను షేర్ చేసిన రానాకు టాలీవుడ్ ప్రముఖులందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారో ఓ సారి చూద్దాం.

    మళ్లీ ప్రేమలో పడ్డ రానా దగ్గుబాటి.. ప్రేయసి ఎవరంటే..మళ్లీ ప్రేమలో పడ్డ రానా దగ్గుబాటి.. ప్రేయసి ఎవరంటే..

    బ్యాచ్‌లర్ లిస్ట్ తగ్గిపోతోంది..

    బ్యాచ్‌లర్ లిస్ట్ తగ్గిపోతోంది..

    చిత్రసీమలోని బ్రహ్మచారిల లిస్ట్ తగ్గిపోతూ వస్తోంది. నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోలు ఇప్పటికే వివాహా తేదీలు కూడా నిర్ణయించుకున్నారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. గుళ్లో అయినా సరే పెళ్లి చేసుకుంటానని చెప్పిన నిఖిల్ కూడా వెనకడుగు వేశాడు.

    ఎప్పటి నుంచో నాన్చుతూ వస్తున్న హీరోలు..

    ఎప్పటి నుంచో నాన్చుతూ వస్తున్న హీరోలు..

    ప్రభాస్, రానాల పెళ్లి విషయమై ఎన్నో యేళ్ల నుంచి ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిలో రానా మొత్తానికి ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. కాసేపటి క్రితమే తన ప్రేయసి ఓకే చెప్పిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మిహీక బజాజ్‌ తనకు ఓకే చెప్పిందని ప్రకటించిన వెంటనే సినీ ప్రముఖులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు

    బ్యాచ్‌లర్ పార్టీ ఎప్పుడు..

    బ్యాచ్‌లర్ పార్టీ ఎప్పుడు..

    రానాకు తన ప్రేయసి ఓకే చెప్పిన సందర్భంగా పూరీ జగన్నాద్ స్పందిస్తూ.. కంగ్రాట్స్ రానా, బ్యాచ్ లర్ పార్టీ ఎప్పుడని తనకు కావాల్సింది అడిగేశాడు. ఇక రానా క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ స్పందిస్తూ కొంటెగా.. ఫైనల్లీ యాయ్.. అంటూ ఓ పోస్ట్ చేశాడు.

    గ్యాంగ్‌లోకి ఎంట్రీ..

    గ్యాంగ్‌లోకి ఎంట్రీ..

    ఈ ఏడాది బ్రహ్మచారుల లిస్ట్‌లోంచి బయట పడుతున్న నిఖిల్, నితిన్ స్పందిస్తూ.. కంగ్రాట్స్ బ్రో.. గ్యాంగ్ లోకి స్వాగతం సుస్వాగతం అంటూ ఒకరు ట్వీట్ చేశారు.. నిఖిల్.. కంగ్రాట్స్.. ఎంగేజ్‌డే గ్యాంగ్‌లోకి స్వాగతం.. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. క్రిష్, శోభు యార్లగడ్డ, హరీష్ శంకర్ వంటి వారు రానాకు కంగ్రాట్స్ తెలిపారు.

    డ్రీమ్ అంటోన్న సుప్రీమ్ హీరో..

    ఇదొక డ్రీమ్.. ఓకే గుడ్ నైట్.. బ్యాక్ టు స్లీప్ అంటూ తన సోలో లైఫే సో బెటరు కాన్సెప్ట్‌కు కౌంటర్ వేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక అందాల చందమామ కాజల్ కూడా రానాకు కంగ్రాట్స్ తెలిపింది. ఇంకా ప్రముఖులెందరో విషెస్ చెబుతూనే ఉన్నారు.

    English summary
    Celebrities Congrats To Rana Daggubati For His Fiancee Miheeka Bajaj. All Tollywood Celebraties Like Ram Charan, Puri jagannadh, Nithiin, Nikhil Siddharth, Congtratulated Rana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X