ఓవైపు చలి...మరోవైపు హాట్ హాట్‌గా హీరోయిన్లు(ఫోటోలు)
ముంబై: ఓ వైపు వర్షాకాలం ముగిసి పోయి...చలికాలం ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. ఇదే అదునుగా అభిమానులకు తమ అందాలతో వేడి పుట్టించేందుకు....హాట్ హాట్ ఫోటోలతో మేగజైన్ల కవర్ పేజీలపై దర్శనం ఇస్తున్నారు సినీ సెలబ్రిటీలు. నవంబర్ నెల సంచికకుగాను పలువురు స్టార్లు వివిధ మేగజైన్లపై హాట్‌లుక్‌తో ఫోకస్ అయ్యారు.
హీరోయిన్లు పబ్లిసిటీ కోసం మేగజైన్ కవర్ పేజీల కోసం తమ అందాలను హాట్ అండ్ సెక్సీగా ఆరబోయడం చాలా కాలంగా జరుగుతున్న తంతే. మరో వైపు మేల్ సెలబ్రిటీలు కూడా తమ ప్రాభవం తగ్గకుండా ఉండటానికి, మరింత పాపులారిటీ పెంచుకోవడానికి మేగజైన్ల కవర్ పేజీలపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు.
హీరోయిన్ల సోయగాలు, సినిమాల వివరాలు, కార్పొరేట్ ఉత్పుత్తుల ప్రమోషన్, కాసిన్ని మసాలా వార్తలు.....ఆకట్టుకునే లుక్, క్వాలిటీతో పాఠకులకు వినోదాన్ని పంచడానికి పోటీ పడుతున్నాయి పలు టాప్ మేజగైన్లు. ఈ జనరేషన్ లైఫ్ స్టైల్ చిట్కాలతో కూడిన హెల్త్, బ్యూటీ, ఫ్యాషన్, సెక్స్ సంబంధమైన మేగజైన్లకు కూడా ఆదరణ ఎక్కువే. పలువురు సినీ స్టార్స్, మోడల్స్ నగ్న, అర్ధనగ్న అందాల ప్రదర్శన కూడా మేగజైన్లపై జనాల్లో క్రేజ్ పెరగడానికి మరో కారణం.
నవంబర్ నెల సంచకలో మేగజైన్లపై సెలబ్రిటీల లుక్ ఎలా ఉందనే దానిపై ఓ లుక్కేస్తూ, వారి సినిమా విశేషాలు తెలుసుకుందాం...

దీపిక పదుకొనె
వరుస హిట్లతో తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిన దీపిక పదుకొనె నవంబర్ నెల ఇండియా టుడే మేగజైన్ కవర్ పేజీపై ఇలా దర్శనం ఇచ్చింది. ఇటీవల చెన్న ఎక్స్ ప్రెస్ సినిమాతో మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది దీపిక. ఆమె నటించిన రామ్ లీలా, కొచ్చాడయాన్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో హ్యాపీ న్యూఇయర్ సినిమాలో నటిస్తోంది.

సోనమ్ కపూర్
అనిల్ కపూర్ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన సోనమ్ కపూర్‌కు....సక్సెస్‌లు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. రంఝానా, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలు ఆమెుకు మంచి పేరు తెచ్చాయి. తాజాగా Bewakoofian, Khoobsurat చిత్రాల్లోనటిస్తోంది. ఫెమినా తమిళ వెర్షన్ మేగజైన్ నవంబర్ సంచికపై సోనమ్ ఇలా హాట్ లుక్‌తో దర్శన మిచ్చింది.

సోనాక్షి సిన్హా
దబంగ్ చింత్రంతో తెరంగ్రేటం చేసి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిన భామ సోనాక్షి సిన్హా. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది సోనాక్షి. గ్రాజియా అనే మేగజైన్ నవంబర్ నెల కవర్ పేజీపై ఇలా సెక్సీగా లుక్‌తో దర్శనమిచ్చింది.

కాజల్ అగర్వాల్
సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ సౌత్ స్కోప్ నవంబర్ నెల సంచికపై ఇలా హాట్ లుక్ తో కనిపించింది.

డయానా పెంటీ
సైఫ్ అలీఖాన్ హీరోగా వచ్చిన ‘కాక్‌టైల్' చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించిన మోడల్ డయానా పెంటీ Elle మేగజైన్ నవంబర్ నెల సంచికపై ఇలా దర్శనమిచ్చింది.

చిత్రాంగద సింగ్
బాలీవుడ్ బ్యూటీ చిత్రంగద సింగ్ బజార్ మేగజైన్ కోసం ఇలా హాట్ వైట్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

కాజోల్
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నా......తన సెలబ్రిటీ హోదాను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఇలా మేగజైన్లపై, సినిమా ఫంక్షన్లలో తళుక్కుమంటోంది. తాజాగా హలో మేగజైన్ నవంబర్ సంచికపై ఇలా దర్శనమిచ్చింది.

రణవీర్ సింగ్
పురుషుల మేగజైన్ ‘బజార్ మెన్' నవంబర్ సంచికపై బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఇలా దర్శన మిచ్చారు.

రణవీర్, దీపిక
సినీబ్లిట్జ్ నవంబర్ నెల మేగజైన్‌పై రణవీర్, దీపిక ఇలా దర్శనమిచ్చారు. ఈ నెలలోనే వీరిద్దరు కలిసి నటించిన ‘రామ్ లీలా' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇదంతా సినిమా పబ్లిసిటీలో భాగమే అని చెప్పక తప్పదు.

అమీ జాక్సన్
బాలీవుడ్ల సినిమాలతో పాటు ఇటు సౌత్ సినిమాలతో నటిస్తూ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉంది బ్రిటన్ భామ అమీ జాక్సన్. వెర్వ్ మేగజైన్ నవంబర్ నెల సంచికపై ఇలా అందాలు ఆరబోసింది.

ఐశ్వర్యరాయ్
ప్రపంచ అందాల సుందరిగా, బాలీవుడ్ నటిగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ తాజాగా నవంబర్ నెల ఫిల్మ్ ఫేర్ మేగజైన్ సంచికపై ఇలా హాట్ లుక్ తో దర్శనమిచ్చింది.

సోనమ్ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఫెమీనా హిందీ వెర్షన్ మేగజైన్ నవంబర్ సంచికపై ఇలా ఓర చూపులతో అభిమానులను బోల్డ్ చేసే ప్రయత్నం చేసింది.

హృతిక్ రోషన్
నవంబర్ సంచిక మ్యాన్ మేగజైన్‌పై హృతిక్ రోషన్ ఇలా డిఫరెంటు లుక్ తో కనిపించారు. ఈ నెలలోనే ఆయన నటించిన క్రిష్ 3 చిత్రం విడుదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇదంతా అని స్పష్టమవుతోంది.

గుల్ పనాగ్
బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ఉమన్ హెల్త్ మేగజైన్ నవంబర్ నెల కవర్ పేజీపై ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.


Click it and Unblock the Notifications











