twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెజెండ్‌ను కోల్పోయాం: కోడి రామకృష్ణ మరణంపై జూ ఎన్టీఆర్, ప్రముఖుల ట్వీట్స్!

    |

    శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

    రామకృష్ణ మరణంతో షాకైన పలువురు తెలుగు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని, తెలుగు సినిమా అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, యువ దర్శకులకు ఆయన మార్గదర్శకుడని వ్యాఖ్యానించారు.

    లెజెండ్‌ను కోల్పోయాం: జూ ఎన్టీఆర్

    తెలుగు సినీ పరిశ్రమ లెజెండ్‌ను కోల్పోయింది. ఒక గొప్ప దర్శకుడిని మిస్సయ్యాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. అని జూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

    పరిశ్రమకు పెద్ద లోటు

    కోడి రామకృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

    మహేష్ బాబు

    కోడి రామకృష్ణ మరణవార్త బాధించింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి మరువలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    మాలాంటి ఎంతో మందికి స్పూర్తి

    కోడి రామకృష్ణగారి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఒక లెజెండ్. నాలాంటి ఎంతో మంది దర్శకులకు స్పూర్తి... అంటూ అనిల్ రావిపూడి వ్యాఖ్యానించారు.

    మార్గదర్శకుడిని కోల్పోయాం

    మనం ఒక మార్గదర్శకుడిని కోల్పోయాం. తెలుగు సినిమా పరిశ్రమకు విఎఫ్ఎక్స్ పొటెన్షియాలిటీ తెచ్చిన దర్శకుడాయన. అమ్మోరు, అరుంధతి లాంటి చిత్రాలు మనకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

    ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు

    కోడి రామకృష్ణ గారు వందకు పైగా చిత్రాలు తీయడంతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో గొప్ప చిత్రాల జ్ఞాపకాలను అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ.. గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.

    English summary
    Celebrities Pay Homage To Kodi RamaKrishna. "Telugu Cinema has lost a Legend. #RIPKodiRamaKrishnaGaru . You will be missed." Jr NTR tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X