జక్కన్న మెచ్చిన సాహూ టీజర్.. పూరి జగన్నాథ్ డిఫరెంట్ రెస్పాన్స్
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' టీజర్ వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన సాహూ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. హాలీవుడ్ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా 'సాహో' ఉండబోతోందని టీజర్ ద్వారా తెలిసిపోతోంది. ఈ టీజర్ చూసిన సినీ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
రాజమౌళి రెస్పాన్స్
యూవీ క్రియేషన్స్ వారు బడ్జెట్ కి న్యాయం చేస్తే.. డైరెక్టర్ సుజీత్ తన రెస్పాన్సిబిలిటీ కి న్యాయం చేశాడు. టెర్రిఫిక్ టీజర్. ప్రభాస్ యాక్షన్ అదిరిపోయింది.
హీరో నితిన్ ట్వీట్
సాహో టీజర్ కాక రాజేసింది. చాలా ఇంటెన్స్‌గా, అద్భుతంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ సుజిత్, శ్రద్దాకపూర్, యూవీ క్రియేషన్స్, సాహో చిత్ర యూనిట్‌కి నా అభినందనలు.
మరో చారిత్రాత్మక సినిమా
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరో చారిత్రాత్మక సినిమా
దేశంలోనే అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరో చారిత్రాత్మక సినిమా రాబోతున్నది. హాలీవుడ్ స్ఠాయికి తగినట్టుగా సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. సాహో సినిమాను చూడటానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు రెడీగా ఉండండి అని అల్లు శిరీష్ ట్వీట్ పెట్టాడు
సాహూ టీజర్ ఫెంటాస్టిక్
సాహూ టీజర్ ఫెంటాస్టిక్ గా ఉంది. హీరో ప్రభాస్‌కి, డైరెక్టర్ సుజిత్‌కి, యూవీ క్రియేషన్స్, సాహో చిత్ర యూనిట్‌కి హృదయ పూర్వక శుభాకాంక్షలు. అని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ వారు ట్వీట్ పెట్టారు.
సాహూ టీజర్ ఇన్స్పైరింగ్
సాహూ టీజర్ ఇన్స్పైరింగ్‌గా ఉంది. యాక్షన్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆధ్బుతంగా ఉన్నాయి అని సినీ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ పేర్కొన్నాడు.
సినిమా చూడాలని ఆతృత
''ప్రభాస్ అదరగొట్టేశాడు. సాహూ టీజర్ సూపర్. శ్రద్ద కపూర్, ప్రభాస్, సుజీత్ వెరీ వెల్. సాహూ సినిమా చూడాలని ఆతృతగా ఉంది''. అని దగ్గుబాటి రానా అన్నాడు.
అక్కినేని నాగార్జున హ్యాపీ
సాహూ టు ప్రభాస్.. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం రానుంది. ఆల్ ది బెస్ట్ సాహూ టీం అని నాగార్జున తన సంతోషం వ్యక్తం చేశారు.
All the best to the whole team. Really excited about this one. Violent #DieHardFans gurinchi thelisindhega:)
Massive! https://t.co/zJXAHzmviE — Siddharth (@Actor_Siddharth) June 13, 2019 '>
మైండ్ బ్లోయింగ్..
మైండ్ బ్లోయింగ్.. చాలా ఎక్సయిట్ అయ్యాను. తెలుగు తెరపై భారీ యాక్షన్ సినిమా రానుంది. సాహూ చిత్రయూనిట్ కి శుభాకాంక్షలు అనిహీరో సిద్దార్థ్ పేర్కొన్నాడు.
తెలుగు తెరకు కొత్త లోకం
తెలుగు తెరకు కొత్త లోకం చూపించ బోతున్నారు. సూపర్ సాహూ టీమ్. టీజర్ అదిరింది. టీజర్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ అనే మాట కూడా చిన్నదే అనిపిస్తోంది అనిసాయి ధరమ్ తేజ్ ట్వీట్ పెట్టాడు.
పూరి జగన్నాథ్ ట్వీట్
ఇంక్రిడబుల్.. సూపర్ అంటూ ప్రభాస్ సాహూ ఎమోజీ పోస్ట్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











