గ్రేట్ మూవీ: ‘ఘాజీ’ సినిమా సెలబ్రిటీల స్పందన
ఘాజీ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు సినిమాలపై తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.
హైదరాబాద్: రానా దగ్గుబాటి హీరోగా నటించిన 'ఘాజీ' చిత్రం ఫిబ్రవరి 17న గ్రాండ్ గా విడుదలవుతోంది. అయితే రిలీజ్ రెండు రోజుల ముందుగానే ప్రముఖులు, మీడియా వారి కోసం ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు సినిమాలపై తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.
సినిమా చాలా గొప్పగా ఉందని, ఇండియన్ సినీ చరిత్రలో తొలిసారి ఇలాంటి సినిమా రావడం హ్యాపీగా ఉందని పలువురు స్టార్స్ స్పందించారు. మరికొందరు స్టార్స్... ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాక్షించారు.
1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. సబ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావడం విశేషం.
మెగాస్టార్ వాయిస్ సినిమాకు ప్లస్
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అవుతుందిన అంటున్నారు. చిరంజీవి వాయిస్ తో కూడిన ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

రిలీజ్ ఎప్పుడంటే
1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు. సబ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావడం విశేషం. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కాబోతోంది.

ది బెస్ట్ క్లైమాక్స్
'ఘాజీ' కోసం ఏకంగా ఐదు క్లైమాక్స్‌లను రాసుకున్నాడట దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తరువాత ఆ క్లైమాక్స్‌లను యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్‌ను ఫైనల్ చేసి దాన్నే సినిమాలో చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications











