గబ్బర్‌సింగ్‌పై..వర్మ, రాజమౌళి, శ్రీను వైట్ల స్పందన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్‌ను అభినందనలతో ముంచెత్తారు. గబ్బర్ సింగ్ సినిమాపై ఎవరెవరు ఎలా స్పందించారో ఒకసారి లుక్కేద్దాం..
రాజమౌళి : ఫైనల్లీ హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద హిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సినిమా మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ విత్ పవర్ స్టార్ స్టైల్. కెవ్వుకేక సాంగు కిద్దిగా డిస్సప్పాయింట్ చేసినా...సినిమాలో అంత్యాక్షరి సీన్ హైలెట్‌గా నిలిచింది. సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి దర్శకుడి ఎబిలిటీయే కారణం. కంగ్రాజ్యులేషన్స్.
రామ్ గోపాల్ వర్మ : Congraaaaaaaaaaaaaats on the POWER PUNCH!
పూరి జగన్నాథ్ : బెస్టాఫ్ లక్ బ్రదర్ గణేష్ అండ్ హరీష్. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే పండగ.
శ్రీను వైట్ల : పవర్ స్టార్ పవర్‌ని ఫుల్‌గా వాడుకున్న హరీష్ శంకర్
కోన వెంకట్ : గబ్బర్ సింగ్ గురించి గొప్ప రెస్పాన్స్ వస్తోంది. హరీష్ అండ్ బండ్ల గణేష్‌కి మరియు మైడియర్ ప్రెండ్ పవన్ కళ్యాణ్‌కి కంగ్రాట్స్....చీర్స్
అల్లరి నరేష్ : పవనిజం అంటే ఏమిటో గబ్బర్ సింగ్ విడుదలైన తర్వాత అర్థమైంది. కంగ్రాట్స్ 'గబ్బర్ సింగ్' టీం.
సిద్దార్థ్ : గబ్బర్ సింగ్ సినిమా న్యూ పైసా వసూల్ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది రికార్డుల కోసం ఎదురు చూడాల్సిన సమయం.
శృతి హాసన్: ఈచిత్రాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితంలో మరిచిపోలేని రోజు.


Click it and Unblock the Notifications











