రోమాలు నిక్కబొడిచాయి: మహేష్ బాబు ‘ఫస్ట్ ఓథ్‌’పై సినీ స్టార్ల స్పందన

By Bojja Kumar

Recommended Video

మహేష్ బాబు ‘ఫస్ట్ ఓథ్‌’పై సినీ స్టార్ల స్పందన..!

'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు- హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాలో మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఆడియోను 'ఫస్ట్ ఓథ్' పేరుతో విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. పలువురు సినీ స్టార్లు కూడా దీనిపై స్పందించారు.

 రొమాలు నిక్కబొడిచాయి

రొమాలు నిక్కబొడిచాయి

ఇది విన్న వెంటనే నా రోమాలు నిక్కబొడిచాయి. ఫస్ట్ ఓథ్ అద్భుతంగా ఉంది అంటూ అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

 అన్ని సీట్లు, ఓట్లు మావే

అన్ని సీట్లు, ఓట్లు మావే

ఈ ఏడాది జరిగే ఎలక్షన్లో అన్ని ఓట్లు, సీట్లు మావే... నో డౌట్ అంటూ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

 ఇది జస్ట్ బిగినింగే

ఇది జస్ట్ బిగినింగే

మహేష్‌ బాబు వాయిసే అంతా చెప్పేస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేన‌ని వంశీ పైడిపల్లి వ్యాఖ్యానించారు.

వీనులవిందు తర్వాత కన్నుల పండుగలా

వీనులవిందు తర్వాత కన్నుల పండుగలా

మహేష్‌ గొంతు వింటుంటే సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకొచ్చారని రామజోగయ్య శాస్త్రి పేర్కొన్నారు. వీనులవిందు తర్వాత కన్నుల పండుగలా ఫస్ట్ లుక్ ఉందని ట్వీట్ చేశారు.

 ఆల్ ది బెస్ట్ చెప్పిన ఒక్కడు డైరెక్టర్

ఆల్ ది బెస్ట్ చెప్పిన ఒక్కడు డైరెక్టర్

మహేష్ బాబుతో ఒక్కడు లాంటి సూపర్ హిట్ చిత్రం తీసిన గుణ శేఖర్ మహేష్ బాబు అండ్ ‘భరత్ అనే నేను' టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.

'అబ్బా..ఏమున్నాడు రా బాబూ'

'అబ్బా..ఏమున్నాడు రా బాబూ' అని సుధీర్ బాబు వ్యాఖ్యానించాడు.

రిపబ్లిక్ డే ట్రీట్

రిపబ్లిక్ డే ట్రీట్

గణతంత్ర దినోత్సవ ట్రీట్‌ ఇది అని మెహరీన్ ట్వీట్ చేసింది.

 సమ్మర్ రిలీజ్

సమ్మర్ రిలీజ్

సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని విడుదల ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ మహేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.

 మహేష్‌ కెరీర్‌లో పవర్‌ఫుల్‌ మూవీ

మహేష్‌ కెరీర్‌లో పవర్‌ఫుల్‌ మూవీ

నిర్మాత డివివి దానయ్య గతంలో మీడియాతో మాట్లాడుతూ '' మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

నటీనటులు, తెర వెనక

నటీనటులు, తెర వెనక

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X