ఆసుపత్రిలో చేరిన పోసాని కృష్ణ మురళి, ఆపరేషన్ జరిగిందా?

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోసానిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఆరోగ్యం గురించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

గజ్జల్లో సమస్యతో బాధ పడుతున్న పోసాని... ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య కారణంగానే ఆయన గతంలో ఎన్నికల సంఘం నోటీసులు పంపినా విజయవాడ వెళ్లలేకపోయారు. ఆ సమయంలోనే మీడియా ముఖంగా తన సమస్య గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.

 Celebrities visit Posani Krishna Murali at Yashoda Hospital

''నాకు నడుము కింది భాగంలో గజ్జల్లో ఇబ్బంది కిలిగింది. దాని వల్ల సరిగా నడవలేక పోతున్నాను. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలనిచెప్పారు. మహేష్ బాబు నటిస్తున్న 'మహర్షి', ఇంకా కొన్ని సినిమా షూటింగులు ఉన్నాయి కాబట్టి అవి ఆగిపోకూడదని ఆపరేషన్ వాయిదా వేయించుకున్నట్లు పోసాని మార్చి 21వ తేదీన మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

వైసీపీ, జగన్ మద్దతుదారుడైన పోసాని కృష్ణ మురళిపై ఓ టీవీ ఛానల్‌లో ఎన్నికల ముందు తప్పుడు కథనం రావడంతో రియాక్ట్ అవుతూ తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి వెల్లడించారు. ఎట్టకేలకు ఆయన తన సమస్యను ఆపరేషన్ ద్వారా నయం చేయించుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X