CCL 2025 Schedule: సీసీఎల్ షెడ్యూల్ 2025.. ఏ జట్టు ఎప్పుడు? ఎక్కడంటే? సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?

సినీ, క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినీ క్రీడా సంబరం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నువ్వా, నేనా అనే విధంగా జరిగే ఈ టోర్నమెంట్‌లో విజయాన్ని దక్కించుకొనే వేటలో అన్నీ టీమ్‌లు సిద్దమవుతున్నాయి. దేశంలోని అన్ని భాషల సినీ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ వంతుగా ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ టోర్నమెంట్‌లో జరిగే మ్యాచుల వివరాలు, ఎన్ని జట్లు పాల్గొంటున్నాయనే వివరాల్లోకి వెళితే..

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL 2025) టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల వివరాలు

1. తెలుగు వారియర్స్ (Telugu Warriors)
2. చెన్నై రైనోస్ (Chennai Rhinos)
3. బెంగాల్ టైగర్ (Bengal Tigers)
4. కర్ణాటక బుల్డోజర్స్ (Karnataka Bulldozers)
5. పంజాబ్ ది షేర్ (Punjab De Sher)
6. ముంబై హీరోస్ (Mumbai Heroes)
7. భోజ్‌పురి దబాంగ్స్ (Bhojpuri Dabbangs)

Celebrity Cricket League CCL 2025 Schedule Here is Matche dates Venues Timings details

ఏ జట్టుకు ఎవరు కెప్టెన్?

బెంగాల్ టైగర్ (Bengal Tigers) జట్టుకు కెప్టెన్‌గా నటుడు జిషు సేన్ గుప్తా, కర్ణాటక బుల్డోజర్స్ (Karnataka Bulldozers) జట్టుకు కిచ్చ సుదీప్ కెప్టెన్‌గా, చెన్నై రైనోస్ (Chennai Rhinos) జట్టుకు హీరో ఆర్య కెప్టెన్‌గా, ముంబై హీరోస్ జట్టుకు సాకిబ్ సలీం, తెలుగు వారియర్స్ జట్టుకు అఖిల్ అక్కినేని, పంజాబ్ ది షేర్ జట్టుకు సోను సూద్ కెప్టెన్‌గా, భోజ్‌పురి దబాంగ్స్ (Bhojpuri Dabbangs) జట్టుకు ఎంపీ, నటుడు మనోజ్ తివారీ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

సీసీఎల్ 2025 టోర్నీలో జరిగే మ్యాచుల వివరాలు

ఫిబ్రవరి 8వ తేదీన

మ్యాచ్ నంబర్ 1: సినీ తారల క్రికెట్ టోర్నీలో ఫిబ్రవరి 8వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై రైనోస్ జట్టుతో గత ఏడాది టైటిల్ విజేత బెంగాల్ టైగర్స్ పోటీపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

మ్యాచ్ నంబర్ 2: తెలుగు వారియర్స్ జట్టుతో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీలో బలమైన జట్లుగా పేరున్న రెండు కూడా బెంగళూరు వేదికగా పోటీపడుతాయి.

ఫిబ్రవరి 9వ తేదీన
మ్యాచ్ నంబర్ 3: ఈ టోర్నీలో మూడో మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. గత ఏడాది విన్నర్ బెంగాల్ టైగర్స్‌ జట్టును పంజాబ్ ది షేర్ జట్టు తలపడుతుంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

మ్యాచ్ నంబర్ 4: సీసీఎల్‌లో నాలుగో మ్యాచ్ ముంబై, భోజ్‌పూరి దబాంగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుంది.

ఫిబ్రవరి 14వ తేదీన
మ్యాచ్ నంబర్ 5: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగుతుంది.

మ్యాచ్ నంబర్ 6: హైదరాబాద్‌లోనే జరిగే 6వ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్ జట్టు పోటీపడుతాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

ఫిబ్రవరి 15వ తేదీన
మ్యాచ్ నంబర్ 7: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ముంబై వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది.

Celebrity Cricket League CCL 2025 Schedule Here is Matche dates Venues Timings details

మ్యాచ్ నంబర్ 8: సీసీఎల్ టోర్నీలో బలమైన జట్లు తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ జట్ల మధ్య మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు జరుగుతుంది.

ఫిబ్రవరి 16వ తేదీన
మ్యాచ్ నంబర్ 9: సెలబ్రిటీ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగే 9వ మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్, భోజ్‌పురి దబాంగ్స్ జట్లు పోటీ పడుతాయి. ఒడిశాలోని కటక్‌లో జరిగే మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు సాగుతుంది.

మ్యాచ్ నంబర్ 10: కటక్‌లోనే జరిగే 10వ మ్యాచ్‌లో ముంబై హీరోస్, బెంగాల్ టైగర్స్ జట్లు తలపడుతాయి. ఈ మ్యాచ్ 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

ఫిబ్రవరి 22వ తేదీన
మ్యాచ్ నంబర్ 11: సూరత్‌ పట్టణంలో జరిగే మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ జట్టుతో చెన్నై రైనోస్ జట్టు పోటీపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

మ్యాచ్ నంబర్ 12: సూరత్‌లోనే జరిగే 12వ మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ జట్టు, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో పోటీపడుతుంది. ఈ మ్యాచ్ 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

ఫిబ్రవరి 23వ తేదీన
మ్యాచ్ నంబర్ 13: సూరత్‌లో జరిగే 13వ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టుతో బెంగాల్ టైగర్స్ జట్టు పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు సాగుతుంది.

మ్యాచ్ నంబర్ 14: సూరత్‌లో జరిగే 14వ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టుతో బెంగాల్ టైగర్స్ జట్టు పోటీపడుతుంది. ఈ మ్యాచ్ 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

సెమీ ఫైనల్ మ్యాచుల వివరాలు

మార్చి 1వ తేదీన: ఇక సెమీఫైనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో 4వ స్థానంలో నిలిచిన జట్టు మార్చి 1వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు సాగుతుంది. వేదిక ఇంకా ఖరారు కాలేదు.

మార్చి 1వ తేదీన: ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచిన జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

ఫైనల్ మ్యాచ్:
సీసీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మార్చి 2వ తేదీ ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు కొనసాగుతుంది. తొలి సెమీఫైనల్‌లో విన్నర్‌తో సెమీ ఫైనల్ 2 విన్నర్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ ఏడాది విజేతగా నిలుస్తుంది. ఇంకా వేదిక ఖరారు కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X